పునీత్ కుమార్తె సాధించింది భయ్యా.. కానీ తండ్రిని గుర్తుచేసుకుని .. వీడియో వైరల్

దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి రాజ్ కుమార్ సాధించింది. తన తండ్రి కలను నిజం చేస్తూ డిగ్రీలో టాప్ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు చేసింది. ఇలాంటి సమయంలో తన తండ్రి ఉంటే బాగుండేదని భావోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Dhruti Rajkumar Graduates Puneeth Rajkumar s Daughter Receives Her Degree

కన్నడ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దివంగత పునీత్ రాజ్ కుమార్. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన కుమార్తె ధృతి టాప్ మార్కులతో అమెరికాలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించింది. తన ఫ్యామిలీతో కలిసి డిగ్రీ పట్టా అందుకుంది. తన తల్లిని కౌగిలించుకుని ఎమోషనల్ అయింది ధృతి. ఈ సమయంలో తండ్రి ఉంటే సంతోషించేవారని ఈ వీడియో చూసిన పునీత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 2021లో ధృతి డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ధృతి పునీత్ రాజ్ కుమార్ ఫోటోస్ చూసి నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

కన్నడ నట దిగ్గజం.. రాజ్ కుమార్ కుమారుడు, ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్(శివన్న) సోదరుడు.. పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ధృతి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆమె తల్లి అశ్విని పునీత్ రాజ్ కుమార్, వినయ్ రాజ్ కుమార్, వందిత పునీత్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్,వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక పునీత్ రాజ్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఆయన్ను ఫ్యాన్స్ ముద్దుగా అప్పు అని పిలుస్తారు. పునీత్ 2002లో అప్పు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ మూవీకి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేశారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించారు పునీత్ రాజ్ కుమార్.

2019లో నటసార్వభౌమ మూవీ రిలీజై విజయం సాధించింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం జేమ్స్. 29 అక్టోబర్ 2021న పునీత్.. జిమ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+