"ధురంధర్ 2" ట్రైలర్ రిలీజ్.. రూ.2 వేల కోట్లు కలెక్షన్స్ పక్కా !!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా.. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా వచ్చిన మూవీ "ధురంధర్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాధవన్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో మరో భారీ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే థియేటర్లలో కలెక్షన్లు కుమ్మరించింది.
డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. హిందీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. కాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా 'ధురంధర్ 2' మూవీ ట్రైలర్ వచ్చేసింది.

సంచలన విజయం సాధించింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన 'ధురంధర్: ది రివెంజ్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా.. రెండో పార్ట్ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్‌లో రణ్‌వీర్ సింగ్ తన "బీస్ట్ మోడ్"లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి కథ మరింత క్రూరమైన ప్రతీకారం చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
నిజ సంఘటనల ప్రేరణ..
'ధురంధర్' కథ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందింది. భారతదేశానికి సంబంధించిన రహస్య ఆపరేషన్లు, గ్యాంగ్‌లు.. క్రిమినల్ సిండికేట్‌లపై జరిగిన చర్యలు ఈ చిత్రానికి నేపథ్యంగా ఉన్నాయి. అలాగే 2008 ముంబై దాడులు, అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలు వంటి అంశాలను కూడా కథలో గమనించవచ్చు. గుడి పడ్వా, ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా విడుదలవుతున్న ఈ గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదే రోజున తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications