ప్రశాంత్ నీల్ పిచ్చిగా ఇష్టపడే స్టార్ హీరో ఎవరో తెలుసా?
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. రాజమౌళి తర్వాత దక్షిణాది నుంచి ఆ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తెలుగు సినిమాను జాతీయస్థాయికి, అంతర్జాతీయస్థాయికి రాజమౌళి తీసుకువెళ్లారు. ఆయన చూపిన బాటలోనే ప్రశాంత్ నీల్ కూడా అడుగులు వేస్తున్నారు. కన్నడంలో మొదటిగా ఉగ్రమ్ సినిమాను రూపొందించారు. అది ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ప్రశాంత్ నీల్ కు మంచిపేరు వచ్చింది.
ఉగ్రమ్ తర్వాత అందరికీ తెలిసిందే.. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో జాతీయస్థాయిలో నీల్ పేరు మార్మోగిపోయింది. తాజాగా సలర్ తో మరోసారి తన సత్తాను చాటాడు. ఈ సినిమా కూడా రూ.650 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. సలార్ 2 శౌర్యాంగపర్వం పనుల్లో ఆయన మునిగిపోయాడు. జాతీయస్థాయిలో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నీల్ కు ఇష్టమైన హీరో ఒకరు ఉన్నారు. షారుక్ ఖాన్ కాదు.. రజనీకాంత్ కాదు.. కన్నడ హీరో కాదు.. తెలుగులో స్టార్ హీరోగా ఉంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హీరోగా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ అంటే మహా ఇష్టం.

ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయలేదు. అయితే తన ఫేవరేట్ హీరో మాత్రం ఎన్టీఆర్ అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు.. జూనియర్ 31వ చిత్రాన్ని తీయబోతున్నాడు. దీనికి సంబంధించి ఎన్నాళ్లనుంచో దాచుకున్న తన సొంతకథను, తన డ్రీమ్ ప్రాజెక్టును తారక్ తోనే తెరకెక్కించబోతున్నారు. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. అది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో విజయదశమికి వాయిదా పడింది. దీని షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో చేస్తారా? మరో డైరెక్టర్ తో చేస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications