Ram Gopal Varma: నువ్వు చేసింది తప్పు కానే కాదు.. నీ వల్లే దానిపై చర్చ..

బాలీవుడ్ నటి, మోడల్ పూనం పాడే గర్భాశయ క్యాన్సర్(cervical cancer) తో చనిపోయినట్లు ఆమె అధికారిక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. దీంతో ఆమె నిజంగానే చనిపోయినట్లు అందరు భావించారు. మీడియా, సోషల్ మీడియాలో ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. 24 గంటల తర్వాత పూనం పాండే సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. తాను బతికే ఉన్నట్లు చెప్పారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

మరికొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే పూనం పాండే ఇలా చేయడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కల్పించడానికి ఎంచుకున్న పద్ధతి కొందరి అర్థం కాకపోవచ్చు. కానీ ఎవరు కూడా ఆమె ప్రయత్నాన్ని ప్రశ్నంచలేరు. ప్రస్తుతం దేశమంతటా గర్భాశయ క్యాన్సర్ పై చర్చ కొనసాగుతోంది. పూనం పాండే ఎన్నో ఏళ్లు ఆనందంగా బతకాలని కోరుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

Director Ram Gopal Varma responded to Bollywood actress Poonam Pandey cervical cancer issue

గర్భశయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేసుకోవాలని పూనం సూచించారు. అందుకు తాను ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. గర్భాశయ క్యాన్సర్ తాను మృతి చెందినా.. ఇది తన మరణంతో ఆగదని.. చాలా మందికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే మహిళలకు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. " నేను చావలేదు. క్యాన్స్ర ఇంకా నన్ను చంపలేదు. కానీ చాలా మందికి వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై అవగాహన కల్పించడం కోసం నాటకం ఆడాను" అని పూనం పాండే చెప్పారు.

పూనం పాండే ఎంచుకున్న విధానం సరైంది కానప్పటికీ.. ఎంచుకున్న సబ్జెక్ట్ కరెక్టేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బాలికలు, మహిళలకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించింది. 9 నుంచి 18 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ వేయిస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గర్భాశయ క్యాన్సర్ తో సంవత్సరానికి 70 వేలకు పైగా మహిళలు చనిపోతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+