ప్రభాస్ మాట వినకుండా ఎన్టీఆర్ చేసిన డిజాస్టర్ మూవీ తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో అనేకమంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. మంచిగా స్నేహం చేస్తుంటారు. కొంతమంది వారి స్నేహాన్ని ఓపెన్ గా బయటికి చెప్పేస్తూ ఉంటారు . పార్టీలకు, పబ్బులకు తిరుగుతూ ఫొటోలకు ఎక్కువగా ఫోజులిచ్చేవారు కొందరుంటారు. వారు తమ స్నేహాన్ని కూడా ఎక్స్ పోజ్ చేస్తుంటారు. అయితే కొందరి స్నేహం మాత్రం ఎంతో స్వచ్ఛతతో ఉంటుంది. స్నేహమంటే ఇదేరా అనే రేంజ్ లో ఉండే వారి స్నేహాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉన్నారు. అలాంటి స్నేహం చేస్తున్నవారిలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ ఆఫ్ గాడెస్ జూనియర్ ఎన్టీఆర్.
వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం చాలామందికి తెలియదు. అంత లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తుంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా అయినా వస్తుందేమోనని అభిమానులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఓ సినిమా చేసే విషయంలో తారక్ ను ప్రభాస్ హెచ్చరించారు. అయినా డార్లింగ్ మాట వినకుండా తారక్ ఆ సినిమా చేసి అట్టర్ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా పేరు రామయ్యా వస్తావయ్యా.

ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు మొదట కథను ప్రభాస్ కే వినిపించారు. ఈ కథ ఫ్లాపవుతుందని తెలిసిన ప్రభాస్ తిరస్కరించాడు. ఆ తర్వాత కథ అటుతిరిగి ఇటుతిరిగి చివరకు తారక్ చేతికి వచ్చింది. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్లింది అని తెలిసిన వెంటనే ప్రభాస్ ఫోన్ చేసి సినిమాను చేయొద్దని హెచ్చరించాడు. అయితే అప్పటికే నిర్మాత, దర్శకులను జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చేశారు. ఇచ్చిన మాట తప్పడం అలవాటులేని ఎన్టీఆర్ ఆ సినిమా ఫ్లాపవుతుందని తెలిసినా నటించేశాడు. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications