ఐదుగురు భార్యలున్న ఏకైక తెలుగు నటుడు ఎవరో తెలుసా..?

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైన్‌ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు. అయితే ఓ నటుడు ఏకంగా ఐదుగుర్ని వివాహం చేసుకుని సంచలనం సృష్టించాడు.అతను మరెవరో కాదు..మహేష్ ఆనంద్.

ఈ తరం ప్రేక్షకులకు మహేష్ ఆనంద్ పెద్దగా తెలియక పోవచ్చు కానీ 1990ల్లో మహేష్ ఆనంద్ అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. తెర మీద విలన్‌గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా మెగా హీరోల సినిమాల్లో(చిరంజీవి, పవన్ కల్యాణ్ ) లంకేశ్వరుడు,రాముడు కాదు రాక్షసుడు,ఎస్.పి.పరశురాం,నెంబర్ వన్,టాప్ హీరో,బొబ్బిలి సింహం,యెస్ నెనంటే నేనే, అల్లుడా మజాకా,ఘరానా బుల్లోడు,తెలుగు వీర లేవరా,జగదేక వీరుడు,సంప్రదాయం,పుట్టింటి గౌరవం,ఆటోడ్రైవర్,బాలు, వంటి సూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. అయితే మనోడు వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలిచారు.

Do you know who is the only Telugu actor with five wives

మహేష్ ఆనంద్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించాడు.విచిత్రం ఏమిటంటే.. ఒక్క భార్య కూడా ఆయనతో కలిసి లేదు. మొదటగా 'బర్క రాయ్' అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.అయితే మహేష్ ఆనంద్ ఆమెతో ఎక్కువ కాలం కాపురం చేయలేకపోయాడు. ఆమెకు విడాకులిచ్చి .. మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 'ఎరికా మరియా డిసౌజా'ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కుక కాలం సాగలేదు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకే రెండో భార్యకు మహేష్ ఆనంద్ విడాకులిచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లాకు 1992లో 'మధు మల్హోత్రా' అనే మహిళను మూడో వివాహం చేసుకున్నాడు.

వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో మూడో భార్యకు సైతం విడాకులిచ్చాడు. ఇక నాల్గో భార్య కోసం కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ ఆనంద్ అంటే 2000 సంవత్సరంలో 'ఉషా బచానీ' అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఒక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. నాలుగో భార్యకు కూడా మనోడు విడాకులిచ్చాడు. ఈసారి ఇండియాన్ అమ్మాయిను కాకుండా విదేశీ అమ్మాయిని లైన్లో పెట్టాడు. 'మళ్లీ లానా' అనే రష్యన్ అమ్మాయిని ఐదో పెళ్లి చేసుకున్నాడు.ఈ అమ్మాయి కూడా ఎక్కువ కాలం మహేష్ ఆనంద్‌తో కలిసి జీవించలేకపోయింది. ఐదు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ, ఒక్కరు కూడా మహేష్ ఆనంద్ జీవితంలో కలిసి ఉండలేకపోయారు. చివరి దశలో ఒంటరిగానే చనిపోయాడు. 57 ఏళ్ళ వయసులో 2019 ఫిబ్రవరి 9న మహేష్ ఆనంద్ ఒంటరిగానే మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+