ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్

ఈ ఫొటోలో మీరు చూస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..? ఒకప్పుడు ఈ హీరో తెలుగు ఇండస్ట్రీని ఏలాడు. అమ్మాయిలు కలల రాకుమారుడుగా ఊహించుకునే వారు. యూత్ అయితే ఆ హీరో హెయిర్ స్టైల్ కావాలని పట్టుబట్టే వారు.ఇప్పటికీ ఈ హీరో ఎవరో గుర్తు పట్టలేకపోయారా..? ఆ హీరో మరెవరో కాదు. అబ్బాస్‌. 1990ల్లో అబ్బాస్‌కు ఎనలేని క్రేజ్ ఉండేది. అబ్బాస్, ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో ఒక సంచలనం. అతని ఆకర్షణీయమైన రూపం, నటనతో యువతను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా 90ల చివర్లో, 2000ల ప్రారంభంలో అతను ఎందరో అమ్మాయిల డ్రీమ్ బాయ్ అయ్యాడు.

"ప్రేమ దేశం" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అబ్బాస్, కేవలం ప్రేమకథలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ రకాల పాత్రలను ఎంచుకుంటూ తన నటనకు పదును పెట్టుకున్నాడు. అబ్బాస్ చేసిన ఓ తప్పుతో ఆయన కెరీర్ ముగిసిపోయింది. జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, బాయ్స్ , జీన్స్, రోబో వంటి సూపర్ హిట్ సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి. శంకర్‌తో సినిమాలు చేయడానికి హీరోలు ఎదురు చూసే పరిస్థితి. అలాంటిది శంకరే నేరుగా వెళ్లి అడిగినా అబ్బాస్ సినిమా చేయలేదు. శంకర్ దర్శకత్వంలో జీన్స్ సినిమాలో మొదట అబ్బాస్‌ని హీరోగా పెట్టాలని అనుకున్నాడట శంకర్.

Do you recognize the star hero in this photo

అబ్బాస్ అయితే ఆ స్క్రిప్ట్‌కి చాలా బాగుంటుందని అనుకున్న శంకర్ అతనికి కథ వినిపించాడట. అయితే కథ నచ్చినప్పటికీ శంకర్ సినిమా నుంచి అబ్బాస్ తప్పుకున్నాడు. అంతకుముందే కొన్ని సినిమాలు కమిట్ అవ్వడంతో శంకర్ సినిమాను చేయలేకపోయాడు. దీంతో చేసేది లేక జీన్స్ సినిమాని వదిలేసుకున్నాడు. ఇక మొత్తానికైతే జీన్స్ సినిమాలో ప్రశాంత్‌ను హీరోగా పెట్టి ఆ సినిమాను తెరకెక్కించారు శంకర్.

ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అబ్బాస్ ఈ సినిమాను వదిలేసుకొని చాలా పెద్ద తప్పు చేశారనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తం అయింది. ఆ తరువాత కొద్దికాలానికే అవకాశాలు లేక అబ్బాస్ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయ్యాడు. జీన్స్ సినిమా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని అబ్బాస్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఫీల్ అయ్యాడు. ఆయన ఇండస్ట్రీని వదిలేసిన అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్లి కొద్ది రోజులు పెట్రోల్ బంక్‌లో పని చేశాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+