స్టార్ హీరోయిన్ పై గృహ హింస కేసు.. హైకోర్టుకు బన్నీ హీరోయిన్

దేశముదురు, మస్కా, కందిరీగ చిత్రాలతో కుర్రకారును ఊపేసిన నటి హన్సిక. తాజాగా ఆమె చిక్కుల్లో పడ్డారు. ఆమెపై గృహ హింస కేసు నమోదైంది. హన్సిక అన్న ప్రశాంత్ మోత్వానీ, అతని మాజీ భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్, హన్సిక, ఆమె తల్లిపై వరకట్న వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. హన్సిక కుటుంబంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు హన్సిక. ఈ మేరకు క్వాష్ పిటిషన్ వేశారు. బాంబే హైకోర్టు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.

2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ.. టీవీ నటి ముస్కాన్‌ జేమ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అదే సమయంలో హన్సిక కుటుంబంపై ముస్కాన్‌.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Domestic Violence Case Filed Against Actress Hansika Moves Bombay High Court

అయితే తాజాగా తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.జస్టిస్‌ సారంగ్‌ కోత్వాల్‌, జస్టిస్‌ ఎస్‌.ఎం. మోదక్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జులై 3 కు వాయిదా వేసింది.

ఇక హన్సిక చిన్నతనం నుంచే యాక్టింగ్ ప్రారంభించింది. ఛైల్డ్ ఆర్టిస్టుగా 'కోయీ మిల్ గయా'సినిమాలో మెరిసింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం విశేషం. ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్‌తో 'కంత్రి', రామ్ పోతినేనితో 'మస్కా', 'కందిరీగ', ప్రభాస్‌తో 'బిల్లా', కళ్యాణ్ రామ్‌తో 'జయీభవ', నితిన్ 'సీతారాముల కళ్యాణం లంకలో' సినిమాలతో హన్సిక అలరించింది.

ఆ తర్వాత హన్సిక భారీగా బరువు పెరిగింది. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. తెలుగులో అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది హన్సిక. ఇక 2022 డిసెంబర్‌‌లో తన బాయ్‌ఫ్రెండ్, బిజినెస్‌మ్యాన్ సోహైల్ కతూరియాని వివాహం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+