బిగ్‌బాస్ సీజన్ 8లోకి మాజీ కంటెస్టెంట్లు.. వారిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి..
ఇటీవలే బుల్లితెరపై ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొదటిరోజు గొడవలు, తిట్లతో మొదలైన ఈ ప్రయాణం కాస్త నామినేషన్ ప్రక్రియతో ఎమోషనల్‌గా సాగింది. ఈసారి ఈ సీజన్ ఏడు జంటలతో గ్రాండ్‌గానే ప్రారంభమయ్యింది. ముందు నుంచి హోస్ట్ నాగార్జున చెబుతున్నట్లుగా ఈసారి ట్విస్టుల మీద ట్విస్టులు ఉండబోతున్నాయట.. అందులో ముందుగా ఈ సీజన్‌కు జంటలుగా రావడం ఒక ఎత్తయితే, సీజన్ మొత్తానికి ఈ సారి హౌజ్‌లో కెప్టెన్ ఉండకపోవడం మరొక విషయం.. వీటితో పాటు మరొక ట్విస్టు కూడా ఉందట.. ఈ సారి హౌజ్‌లోకి మాజీ కంటెస్టెంట్‌లు కూడా రాబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.
ఈసారి హౌజ్‌లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే వచ్చారు. మిగిలిన వాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బిగ్‌బాస్ ఇచ్చిన మరో ట్విస్ట్ ఏంటంటే వారిలో మాజీ కంటెస్టెంట్లు ఉంటారని తెలుస్తుంది. ఒక్కో సీజన్ నుంచి ఒక్కొక్కరిని మళ్లీ ఈ సీజన్‌ని తీసుకొస్తున్నారే ప్రచారం వుంది. వీరిలో ఇద్దరు పేర్లు తెగ ప్రచారంలో ఉన్నాయి. అందులో గత సీజన్‌లో రచ్చ చేసిన బుల్లితెర నటి శోభా శెట్టిని మరోసారి హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట్లు సమచారం. కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న శోభాశెట్టి బిగ్‌బాస్ సీజన్ 7లో ప్రేక్షకులను అలరించింది. చివరివరకూ నిలిచి తనదైన సత్తా చాటింది. అయితే, ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఆమె దీనికి ఒప్పుకుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఏదిఏమైనా మరోసారి శోభాశెట్టి బిగ్‌బాస్ ఇంట్లోకి వస్తే రచ్చ మాములుగా ఉండదని నెటిజన్లు భావిస్తున్నారు.

వైల్డ్ కార్డ్ ద్వారా బుల్లితెర నటులు..
శోభాశెట్టితోపాటు మరో మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ యాంకర్ రవి పేరు కూడా ప్రచారంలో ఉంది. బుల్లితెర యాంకర్ గా పాపులర్ అయిన రవి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్‌గా వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి బిగ్‌బాస్ టీమ్ అతన్నీ సంప్రదించిట్లు తెలుస్తోంది. కానీ, రవి అందుకు ఒప్పుకోలేదని సమాచారం... ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. వీరిద్దరితో పాటు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వారిలో బుల్లితెర నటి రీతూ చైదరి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే సీరియల్ నటుడు ముకేష్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి వైల్డ్ కార్డు ద్వారా ఎవరెవరు హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నారనే విషయం మరికొద్దిరోజుల్లో తెలియబోతుంది.












Click it and Unblock the Notifications