రామ్ చరణ్ రికార్డును బద్ధలు కొట్టిన విజయ్ దేవరకొండ

తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి మద్దతు లేకుండా తన స్వయంశక్తితో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడమేకాదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకులు ఒక సినిమా చేస్తే చాలు.. అందరినీ బీట్ చేసి సూపర్ హీరో అయిపోవడం ఖాయమని విజయ్ అభిమానులు నమ్మకంగా చెబుతుంటారు.

తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన హీరోగా ఆవిర్భవించారు. ఇంతకుముందు ఆ రికార్డు రామ్ చరణ్ పేరుమీద ఉండేది. 21 మిలియన్ ఫాలోవర్స్ ను విజయ్ కలిగివున్నాడు. రామ్ చరణ్ రికార్డును బద్దలుకొట్టిన విజయ్ అల్లు అర్జున్ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా పయనిస్తున్నాడు. ఇంతమంది ఫాలోవర్లు దేవరకొండకు ఉన్నారంటే అతని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విజయ్ అభిమానులు అంటున్నారు.

family hero Vijay Deverakonda create rew reocrd reach 21 Million Followers on Instagram

రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, కొరటాల శివ లాంటి దర్శకులు విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తే చాలని, సూపర్ స్టార్ అయిపోతాడని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే దేవరకొండ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, అలాగే సినిమాలకు సంబంధించిన విజయాలను అప్ డేట్ చేస్తుంటాడు. తరుచుగా అభిమానులతో ముచ్చటిస్తుంటాడు. ఒక్క తెలుగు అనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజయ్ దేవరకొండను లక్షలాదిమంది ఫాలో అవుతుంటారు. తను నటించిన "ఫ్యామిలీ స్టార్" ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి గ్రాండ్ గా రాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+