2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు ఇవే..!
తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను ప్రకటించింది. ఈసారి "గద్దర్ అవార్డులు" పేరుతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. రీసెంట్ గానే 2024 కు సంబంధించి అవార్డులను అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ పాల్గొన్నారు.
2014 జూన్ 2 నుంచి.. అంటే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అయినప్పటి నుంచి సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు మురళీమోహన్ తెలిపారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ చిత్రాలు ఎంపిక చేసినట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అవార్డులు ఇవ్వడం మంచిది కాదు అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ప్రకటించే విషయంలో ఒకే నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకే సినిమాకు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వేర్వేరు కేటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తే అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

గద్దర్ అవార్డుల వివరాలు..
2014..
బెస్ట్ ఫిల్మ్ - రన్ రాజా రన్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - పాఠశాల
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - అల్లుడు శ్రీను
2015..
బెస్ట్ ఫిల్మ్ - రుద్రమదేవి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - కంచె
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - శ్రీమంతుడు
2016..
బెస్ట్ ఫిల్మ్ - శతమానం భవతి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - పెళ్లి చూపులు
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - జనతా గ్యారేజ్
2017..
బెస్ట్ ఫిల్మ్ - బాహుబలి 2
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - ఫిదా
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - ఘాజీ
2018..
బెస్ట్ ఫిల్మ్ - మహానటి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - రంగస్థలం
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - కేరాఫ్ కంచరపాలెం
2019..
బెస్ట్ ఫిల్మ్ - మహర్షి
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - జెర్సీ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - మల్లేశం
2020..
బెస్ట్ ఫిల్మ్ - అలా వైకుంఠపురములో
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - కలర్ ఫోటో
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - మిడిల్ క్లాస్ మెలోడీస్
2021..
బెస్ట్ ఫిల్మ్ - ఆర్ఆర్ఆర్
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - అఖండ
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - ఉప్పెన
2022..
బెస్ట్ ఫిల్మ్ - సీతారామం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - కార్తికేయ 2
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - మేజర్
2023..
బెస్ట్ ఫిల్మ్ - బలగం
సెకండ్ బెస్ట్ ఫిల్మ్ - హనుమాన్
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ - భగవంత్ కేసరి
ఉత్తమ చిత్రాలతో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నట్లు మురళీమోహన్ ప్రకటించారు. అందులో భాగంగా..
ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు - నందమూరి బాలకృష్ణ
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డ్ - మణిరత్నం
BN రెడ్డి ఫిల్మ్ అవార్డు - సుకుమార్
నాగిరెడ్డి & చక్రపాణి ఫిల్మ్ అవార్డు - అట్లూరి పూర్ణ చంద్రరావు
కాంతారావు చలనచిత్ర పురస్కారం - విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు - యెండమూరి వీరేంద్రనాథ్
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications