"ఓజీ" ఫస్ట్ సాంగ్ రిలీజ్.. తమన్‌కి బిర్యానీ పక్కా.. ఫుల్ ట్రెండింగ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (OG)". యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా కనిపించనుండగా.. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఆగస్టు 2న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ చేశారు. "అలలిక కడలిక భయపడలే" అని లిరిక్ తో మొదలైన ఈ పాట నిజంగా పవర్ఫుల్ గా ఉంది. కొన్ని పవన్ కళ్యాణ్ విజువల్స్ తో, అద్భుతమైన ఎలివేషన్స్ తో, పవర్ఫుల్ ఎడిట్స్ తో, అలానే లిరిక్స్ తో ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తుంది. "పగ రగిలేను ఫైరు" వంటి లిరిక్స్ పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేయటానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.
గతంలో సాంగ్స్ విషయంలో తమన్ పై ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అందుకు కౌంటర్ ఇస్తూ కాపీ సాంగ్ కొడితే.. మా అమ్మ అన్నం పెడుతుందా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు సాంగ్ బాగా నచ్చడంతో మెగా ఫ్యాన్స్ అంతా తమన్ కి ఈరోజు బిర్యానీ గ్యారంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ పాట రిలీజ్ చేసి కొద్దీ సేపే అయినప్పటికీ.. వ్యూస్, లైక్స్ విషయంలో దూసుకుపోతూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.
మరోవైపు "హరిహర వీరమల్లు" సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ అభిమానులు.. "ఓజీ" సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. పవన్ స్టైల్, యాక్షన్ మేనరిజంలకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications