చిరంజీవి, అల్లు అర్జున్‌ను వెనక్కు నెట్టిన యంగ్ టైగర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగాన్ని సెప్టెంబరు 27వ తేదీన విడుదల చేస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతలు. ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 10కి వాయిదా పడింది. అక్కడి నుంచి రెండు వారాలు ముందుకు జరిగి సెప్టెంబరు 27న విడుదల కాబోతోంది.
దేశవ్యాప్తంగా గుర్తింపు
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించారు రంభ. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన గణాన్ని తయారుచేసుకున్నారు. విభిన్నమైన పాత్రలను పోషించి అందరిచేత శభాష్ అనిపించారు. పది సంవత్సరాలకు పైగా కథానాయికగా రాణించిన రంభ తెలుగులో 40 సినిమాలు చేశారు. తమిళంలో 35, కన్నడంలో 9, మళయాళంలో , హిందీలే 17 సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

వారిద్దరినీ వెనక్కి నెట్టి..
తన కెరీర్‌లో రంభ 117 సినిమాలు చేయగా.. ఇందులో కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసినవి కూడా ఉన్నాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభకు ఓ ప్రశ్న ఎదురైంది. డ్యాన్స్ బాగా చేసే హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగారు. అందుకు రంభ జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమని చెప్పింది. అతన్ని చూస్తే ముచ్చటేస్తుందని, పిచ్చెక్కిపోతుందని వ్యాఖ్యానించడమేకాదు.. తారక్ నృత్యంపై ప్రశంసలు కురిపించింది. వ్యక్తిగతంగా తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని, కానీ నృత్యం విషయానికొస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కే తన ఓటు అని చెప్పారు. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటివారిని వెనక్కి నెట్టి తారక్ రంభ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడని, అదే తమ హీరో ప్రత్యేకత అని తారక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications