ఏ ఐ టెక్నాలజీతో సినిమా..‘ది డెవిల్స్‌ చైర్‌’

ఇటీవల కాలంలో తెలుగులో యంగ్ డైరెక్టర్లు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్నట్టుగా కథను ఎంచుకుని నేటి తరం ప్రేక్షకులకు చూపించడానికి దర్శకులు తపన పడుతున్నారు.టాలెంటెడ్ దర్శకులు చాలామంది సరైన అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నారు.ఆ లిస్ట్‌లోకి యంగ్‌ డైరెక్టర్‌ గంగ సప్తశిఖర కూడా వస్తారు. తనకిచ్చిన తొలి అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. W/O అనిర్వేష్ అనే సినిమాతో గంగ సప్తశిఖర దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారాయన. తాజాగా ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆయన దర్శకత్వం వహించిన 'ది డెవిల్స్‌ చైర్‌' విడుదలకు రెడీ అవుతోంది. జబర్దస్త్ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే ఈ సినిమాలో అభి హీరోగా నటిస్తున్నారు. ఈ హారర్‌ సినిమా కోసం అప్డేటెడ్ ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించాడట డైరెక్టర్‌. కాన్సెప్ట్‌తో పాటు మేకింగ్‌ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందట. గతంలో ఆయన తెరకెక్కించిన షార్ట్‌ ఫిలిమ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి.

Ganga Saptasagara first film as a director was The Devil s Chair

లిమిటెడ్ బడ్జెట్‌లో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తియ్యగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. 'ది డెవిల్స్‌ చైర్‌'ని కూడా అదే తరహాలో డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్లు పోస్టర్లను చూస్తుంటే అర్థం అవుతోంది.

ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. హీరోగా నటించిన అభి కూడా దర్శకుడి ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు.'ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా దర్శకుడు గంగ సప్తశిఖర ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుందని దర్శకుడు గంగ సప్తశిఖర చెప్పుకొచ్చారు.

'ది డెవిల్స్ చైర్'చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుందని దర్శకుడు గంగ సప్త శిఖర తెలిపారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో పాటు W/O అనిర్వేష్ అనే చిత్రానికి కూడా గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+