హీరోయిన్ ను పక్కకు నెట్టేసిన బాలకృష్ణ?

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన తరం కథానాయకులందరికన్నా వేగంగా సినిమాలు చేయడమే కాకుండా హిట్లు కూడా కొడుతున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోను చురుగ్గా పాల్గొంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీచేశారు. వాటి ఫలితాలు జూన్ నాలుగోతేదీన వెల్లడి కాబోతున్నాయి. మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో బాలయ్య ఉన్నారు.

ప్రవర్తనలో మార్పు రాలేదా?
కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో బాలయ్య ప్రవర్తన గురించి తరుచుగా ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరలవుతుంటాయి. చెంపదెబ్బ కొట్టడంలో ముందుంటారు. వరుసగా రెండు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారంటే అందులో కనీసం ఒక కార్యక్రమంలోనైనా అక్కడికి వచ్చిన ఏదో ఒక వ్యక్తిపై, లేదంటే అభిమానులపై అనుచితంగా చేయిచేసుకుంటారు. ఎన్నోసార్లు ఇలా జరుగుతున్నా ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదనేదానికి నిదర్శనం తాజాగా జరిగిన సంఘటన.

gangs of godavari pre release event nandamuri balakrishna behaved inappropriately with heroine anjali

వీడియోను జాగ్రత్తగా చూడండి అంటున్న బాలయ్య అభిమానులు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలయ్య హీరోయిన్ అంజలితో అనుచితంగా ప్రవర్తించి అందరినీ షాక్ కు గురిచేశారు. తన పక్కనే ఉన్న అంజలిని తోసేశారు. దీంతో ఆమె పక్కనే ఉన్న మరో హీరోయిన్ నేహాశెట్టిని గట్టిగా పట్టుకుంది. తర్వాత స్టిఫ్ గా నిల్చునే ప్రయత్నం అంజలి చేసింది. లోపల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దాన్ని బయటకు కనపడనివ్వకుండా నవ్వుతూ ఉంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్ల మధ్య ఈ సంఘటనకు సంబంధించి యుద్ధం నడుస్తోంది. అంత పెద్ద హీరో అయివుండి అలా ప్రవర్తించడం ఎంతవరకు సబబు అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి.. చివర వరకు చూడండి.. బాలయ్య ఎలా ప్రవర్తించడనేదానికి, అందులో తప్పు ఉందనేదానికి సమాధానం దొరుకుతుందంటున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య నీళ్ల సీసాలో మద్యం పోసుకొని సేవించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+