Gunde Ninda Gudi Gantalu : సెప్టెంబర్ 16 ఎపిసోడ్.. ప్రభావతి చేతుల మీదుగా షాప్ ఓపెన్ !

ప్రముఖ ఛానల్‌లో ప్రసారం అవుతున్న "గుండెనిండా గుడిగంటలు" సీరియల్.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా సెప్టెంబర్ 16వ తేదీన ప్రసారం కానున్న 511వ ఎపిసోడ్ బాలు అమ్మ చేతుల మీదుగా ఓపెన్ చేయించు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నిన్ను క్షమించింది కదా అనగా సత్యం అవును మీ అమ్మ అయితే మనస్పూర్తిగా దీవిస్తుంది అనగా అందుకు మనోజ్ కూడా సరే అని అనడంతో ప్రభావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది.

ఆ తర్వాత అందరూ కలిసి షాపు ఓపెనింగ్ కి వెళ్తారు. అప్పుడు కామాక్షి వచ్చి తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారు అని అంటుంది. ‎ఇంతలోనే అక్కడికి శృతి వాళ్ళ అమ్మ రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు.

gunde-ninda-gudi-gantalu-september-16th-episode-details

ఏంటి మమ్మీ ఈ సర్ప్రైజ్ అనగా అనుకోకుండా వచ్చాను అని అంటుంది. తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్ళగా ఏంటమ్మా మీ పుట్టింటి నుంచి ఎవరూ రాలేదు అని మీనాని అడుగుతాడు సత్యం. ఎవరూ పిలవలేదు అందుకే నేను కూడా రమ్మని చెప్పలేదు మామయ్య అని అంటుంది. ‎నీ పుట్టింటి వాళ్ళు పిలవకపోయినా కూడా వస్తారు కదా అనగా అంత సిగ్గుమాలిన వాళ్ళు ఎవరూ లేరు అని బాధపడుతూ వెళ్ళిపోతుంది మీనా. తరువాత షాపు తన చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు ప్రభావతి తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. అప్పుడు మీనాక్షి ఇకమీదట అయినా పార్కులో పడుకోకుండా గుడిమెట్ల మీద అడుక్కోకుండా శ్రద్ధగా పని చేసుకో అని అంటుంది.

ఇక షాప్ అంతా చూస్తూ బోనీ చేద్దాం అందరూ ఏదొకటి తీసుకోండి అనడంతో.. శోభన.. లక్షన్నర సోఫాని సెలెక్ట్ చేసుకుంటుంది. మీనా మిక్సీ తీసుకుంటుంది. శ్రుతి హెయిర్ డ్రైయర్ కొనాలనుకుంటుంది. ఇక అంతా ఒక చోటికి వచ్చాక ప్రభావతి .. మీనాను అవమానిస్తూ.. శోభనను పొగుడుతుంది. 'పూలు అమ్ముకునేది ఇంతకన్నా ఏం కొంటుందిలే అని అవమానిస్తుంది మీనాని. ఇక లక్షన్నర ఇచ్చి సోఫాని బుక్ చేసుకుంటుంది శోభన. మొదటి బోనీ ఆమె చేతే చేయిస్తుంది.

ఇక అంతా చూసిన సత్యానికి ప్రభావతి ప్రవర్తన నచ్చక పక్కకు తీసుకుని వెళ్లి గడ్డిపెడతాడు. 'ఏం అనుకుంటున్నావ్.. డబ్బు ఉన్నవాళ్ల దగ్గర కోడల్ని అవమానించడమే పనా నీకు? మారవా నువ్వు? అయినా డబ్బు ఉన్నవాళ్లే వియ్యపురాళ్లా నీకు? మీనా వాళ్ల అమ్మని ఎందుకు పిలవలేదు? ఆ మనోజ్ గాడ్ని నెత్తిన పెట్టుకోవడం కాదు.. కాస్త నీ కడుపున పెట్టిన వాళ్లని గుర్తించు.. నువ్వు అలా నెత్తిన పెట్టుకోవడం వల్లే మనోజ్ గాడు గాళ్లో ఎగురుతున్నాడు..' అని చడామడా తిడతాడు. ప్రభావతి మాత్రం దులిపేసుకుంటుంది ఎప్పటిలానే.

gunde-ninda-gudi-gantalu-september-16th-episode-details

ఇక మొత్తానికీ కామాక్షీ చురకలు, బాలు వెటకారాల మధ్యలో షాప్ ఓనర్ వచ్చి డాక్యుమెంట్స్ తెచ్చి ఇస్తాడు. 'బాలు మీద నమ్మకంతోనే ఈ షాప్‌ని ఇంత తక్కువకు ఇచ్చాను జాగ్రత్త' అని చెప్పి వెళ్లిపోతాడు. ఈ షాప్ తక్కువ ధరకు ఇవ్వడానికి కారణం బాలునే అనగా కానీ డబ్బులు కట్టింది మనోజ్ కదా అంటూ కొడుకుని తెగ మూసేస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలోనే రోహిణి ఫ్రెండ్ అక్కడికి వచ్చి మొత్తానికి అనుకున్నది సాధించావు అని అంటుంది.

మరోవైపు కమింగ్ అప్‌లో అసలు ట్విస్ట్ ఉంది. శోభన బుక్ చేసిన లక్షన్నర సోఫాని సత్యం ఇంటికి పంపిస్తుంది శోభన. అయితే అది చూసిన బాలు.. సురేంద్ర ఇంటికి పంపేస్తాడు ఆ సోఫాను. దాంతో శోభన కోపంగా.. 'నా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను' అని మనోజ్ షాప్‌కి వస్తుంది. సీన్ కట్ చేస్తే ఇంట్లో బాలుని నిలబెట్టి పంచాయితీ పెడతారు మనోజ్, శ్రుతిలు. 'మా అమ్మ నాకోసం పంపిస్తే ఎలా తిరిగి పంపిస్తావ్ బాలు' అని శ్రుతి.. 'ఆవిడ ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతో పాటు నన్ను షాప్‌కి వచ్చి అవమానించింది' అని మనోజ్.. బాలుని దోషిగా నిలబెట్టి వాయిస్తుంటారు. ప్రభావతి, సత్యం, మీనా, రవి అంతా అక్కడే ఉన్నారు. ఆ గొడవ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+