వాయువేగంతో దూసుకుపోతున్న 'హనుమాన్'... మూవీ హిట్ కు కలిసొచ్చిందిదే!!

ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన పెద్ద సినిమాలకు షాక్ ఇచ్చి హనుమాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చిత్ర యూనిట్ ను సంతోషంలో ముంచెత్తుతోంది. థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గుంటూరు కారం సినిమా కు నెగటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమా దూకుడు మరింత పెరిగింది. అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ఈ సినిమాలో పెద్దగా అద్భుతాలు ఏమీ లేనప్పటికీ, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని మినహాయించి చెప్పుకోదగిన పెద్ద నటీనటులు కూడా లేనప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Hanuman become a hit movie.. interesting reason behind hanuman hit!!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా సక్సెస్ కావడం వెనుక కారణం ఏంటి అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా చర్చించుకుంటున్న విషయం . అయోధ్యలో 22వ తేదీ రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కొనసాగనున్న క్రమంలో హనుమాన్ పేరుతో తీసిన ఈ సినిమా ప్రస్తుతం జనాల ఆలోచనలకు దగ్గరగా ఉంది.

దేశవ్యాప్తంగా శ్రీరామ పూజిత అక్షింతలు ఇంటింటికి పంపిణీ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరిలోనూ రామభక్తి పెల్లుబుకుతోంది. మరోవైపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడు కానున్న సమయం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరిలోనూ భక్తి పారవశ్యానికి కారణంగా మారింది.

ఈ సమయంలో పరమ రామ భక్తుడైన హనుమాన్ పేరుతో తీసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆలోచనలకు, మనసుకు దగ్గర కావడంతో సినిమా హిట్ అయింది అన్న టాపిక్ వస్తుంది. ఈ సినిమాలో కథ పెద్దగా కొత్తగా అనిపించినప్పటికీ, గతంలో చిరంజీవి నటించిన అంజి తరహా సినిమాలా అనిపించినప్పటికీ ఈ సినిమాను హనుమాన్ పేరే సక్సెస్ చేసింది.

ఇక ఈ సినిమాలో నటించింది యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ కాకపోయినప్పటికీ సమయానుకూలంగా చిత్రాన్ని రిలీజ్ చేయడంతోనే ఈ సినిమా సక్సెస్ అయింది. రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదనేది పబ్లిక్ టాక్. ఇప్పుడు అంతా శ్రీరామ మేనియా దేశమంతా కొనసాగుతున్న వేళ సినిమా భారీ కలెక్షన్ లను రాబడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+