కంటిచూపు కోల్పోయిన 'హనుమాన్' హీరో తేజ సజ్జా?

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ అందించడంపై సినీ ప్రియులంతా సినిమా డైరెక్టర్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఈ చిత్రం సక్సెస్ మీట్ లో హీరో తేజ తాను పడిన కష్టాన్ని తెలియజేస్తూ చెప్పిన కామెంట్లు వైరలవుతున్నాయి. హనుమాన్ లో రోకలి బండతో కొట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. వీటిని చేస్తున్న సమయంలో తనమీద పూర్తిగా పట్టేసిందని, తర్వాతరోజు షూటింగ్ కూడా చేయలేకపోయానన్నారు. చిత్ర కథలో భాగంగా హీరోకు ఆంజనేయస్వామి శక్తులు వచ్చినప్పుడు గాలిలో తేలియాడే సన్నివేశాలను ఎంతో కష్టపడి తీసినట్లు చెప్పారు.

Hanuman hero Teja Sajja lost his eye sight?

సినిమాలో ఈ సన్నివేశం కోసం దాదాపు 6 గంటలు గాలిలో తాళ్ల సహాయంతో వేలాడినట్లు తేజ వెల్లడించారు. క్లైమాక్స్ కోసం షూటింగ్ దాదాపు 40 రోజులు నడిచింది. వీటిని చిత్రీకరించే సమయంలో ఎక్కువగా దుమ్ము, పొగ వచ్చాయని, వీటివల్ల తన కంటి చూపు పూర్తిగా దెబ్బ తిందని తేజ తెలిపారు. కుడి కన్ను అసలు కనిపించడంలేదన్నారు.

వైద్యుల దగ్గరకు వెళితే వెంటనే సర్జరీ చేయాలన్నారని, అయితే తాను సినిమా విడుదలైన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని వారితో చెప్పినట్లు తేజ పేర్కొన్నారు. హనుమాన్ కోసం తేజ ఇంత కష్టపడ్డారా? ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతున్న సంగతి తెలిసిందే. 20 సంవత్సరాలపాటు ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హీరో సినిమాను విడుదల చేస్తానని, తనతోపాటు కొత్త డైరెక్టర్ల సినిమాలు కూడా వాటిల్లో ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+