Hanuman: తగ్గేదే లే.. ఇంకా కొనసాగుతోన్న హనుమాన్ దండయాత్ర..!

బాక్సాఫీస్ వద్ద హనుమాన్ మూవీ దండయాత్ర కొనసాగుతోంది. సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్న.. ఈ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. మూవీ విడుదలై19వ రోజున కూడా భారీగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ మూవీ దూసుకెళ్తోంది. హనుమాన్ సినిమా నడుస్తున్న థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన ఫైటర్ సినిమా వచ్చినప్పటికీ.. హనుమాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

మంగళవారం కూడా బాక్సాఫీస్ వద్ద హనుమాన్ మూవీ మంచి కలెక్షన్లు సాధించింది. సోమవారం వసూల్లు కాస్త తగ్గినా.. మంగళవారం మళ్లీ పుంజుకున్నాయి. Saikanlik.com ప్రకారం 19వ రోజు ఈ మూవీ హిందీలో 51 లక్షలు వసూలు చేసింది. 19వ రోజు తెలుగులో రూ.1.61 కోట్లు రాబట్టింది. తమిళ్ లో రూ.లక్ష, కన్నడలో రూ.2 లక్షలు వసూలు చేసింది.

Hanuman movie is soaring in box office collections

హనుమాన్ హిందీ వర్షన్ ఇప్పటి వరకు రూ. 44.51 కోట్లు సాధించింది. తమిళంలో రూ. 1.53 కోట్లు సాధించగా.. కన్నడలో రూ.1.56 కోట్లు రాబట్టింది. హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా రూ.205.8 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్​ లో కూడా భారీగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా చేశారు. హనుమాన్ మూవీ అనేక రికార్డులు నెలకొల్పింది.

ఈ మూవీ బుక్ మై షోలో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ మూవీకి సంబంధించి కేవ‌లం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు బుక్ అయినట్లు బుక్ మై షో ప్రకటించింది. హనుమాన్ కు సిక్వెల్ గా జై హనుమాన్ మూవీ తీయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు.

ఇది కూడా చదవండి : https://telugu.oneindia.com/entertainment/a-video-of-a-woman-swaying-while-watching-the-movie-hanuman-is-going-viral-on-social-media-373197.html

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+