ఇవన్నీ మనకు అవసరమా డార్లింగ్స్..!!
Prabhas: తెలంగాణలో గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాజకీయంగా దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ చర్యలకు దిగింది. మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెట్టింది.
ఇందులో భాగంగా- గంజాయి సాగు, అక్రమ రవాణా గురించి సమాచారం ఇచ్చిన వారికి క్యాష్ రివార్డును ప్రకటించింది. దీనిపై ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలకు తెర తీసింది ప్రభుత్వం. దీన్ని అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకుంటోంది.

దీనితో పాటు- టాలీవుడ్ సహకారాన్ని కూడా తీసుకునే ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలోనే కొన్ని కండిషన్లను పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి చిత్ర నిర్మాణ సంస్థ కూడా మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలను వివరించేలా వీడియోను తమకు అందజేయాల్సి ఉంటుందని అన్నారు.
సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణపై ఒక వీడియోను తప్పనిసరిగా చిత్రీకరించి విడుదల చేయాలని, కొత్తగా విడుదలయ్యే సినిమాలో నటించిన నటీనటులతో ఈ వీడియోను తీయాల్సి ఉంటుందనీ కండిషన్ పెట్టారు అప్పట్లో. టాలీవుడ్ పెద్దలు సమాజం నుంచి ఎంతో తీసుకుంటోన్నారని, కొంతైనా వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ సూచనలకు సానుకూలంగా స్పందించారు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కొత్త ఏడాది వేళ ఈ వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈ వీడియోను విడుదల చేశారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం, యాంటీ నార్కొటిక్స్ విభాగం సంయుక్తంగా ఈ వీడియోను రూపొందించాయి.
డ్రగ్స్ తీసుకోవడం అవసరమా డార్లింగ్స్..!#Prabhas #RebalStarPrabhas #Drugs #SayNoToDrugs #SayNoToDrugsAndAlcohol pic.twitter.com/OXsWVq06eC
— oneindiatelugu (@oneindiatelugu) December 31, 2024
డ్రగ్స్ అమ్మకాలు, వాటి బారిన పడిన వారి గురించి తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్నీ ఈ వీడియోలో పొందుపరిచాయి. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమనీ తెలిపాయి.
లైఫ్‌లో మనకు బోల్డన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనం ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మనవాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. Say no to Drugs today. మీకు తెలిసిన వాళ్లెవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే ఈ టోల్ ఫ్రీ నంబర్ 871267111 నంబర్‌కు కాల్ చేయండి. వాళ్లు పూర్తిగా కోలుకునేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.. అని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications