ఇది పవన్ కల్యాణ్ సినిమానేనా..? దారుణంగా హరిహర వీరమల్లు కలెక్షన్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్ జోరు తర్వాత వర్కింగ్ డేస్‌లో నిరాశ పరిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ డ్రాప్స్‌ను నమోదు చేసింది. 'హరిహర వీరమల్లు' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, వీకెండ్‌లో కొంతవరకు నెట్టుకొచ్చినా, వర్కింగ్ డేస్‌లో మాత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశను మిగిల్చింది.
హరిహర వీరమల్లు' పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రూ.12.75 కోట్లు రాబట్టి మంచి శుభారంభాన్నిచ్చింది. ఫస్ట్ డే నాడు రూ.34.75 కోట్లు వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే, రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, మూడో రోజున రూ.9.15 కోట్లు, నాలుగో రోజున రూ.10.6 కోట్లు వసూలయ్యాయి.

వీకెండ్ వరకు కొంత పర్వాలేదనిపించినా, వర్కింగ్ డేస్‌లో సినిమా కలెక్షన్లు ఊహించని విధంగా పడిపోయాయి. ఐదో రోజైన సోమవారం కేవలం రూ.2.1 కోట్ల నెట్ మాత్రమే రాబట్టగలిగింది. ఆరో రోజుకు వచ్చేసరికి పరిస్థితి మరింత దిగజారింది. ఆరో రోజున ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.80 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం, మొత్తంగా ఐదు రోజుల వరకు ఈ చిత్రానికి ఇండియా వైడ్ రూ.78 కోట్ల నెట్, రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. భారీ బడ్జెట్‌తో పోలిస్తే, ఈ వసూళ్లు చాలా తక్కువ. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'హరిహర వీరమల్లు' అనుకున్న అంచనాలను అందుకోలేకపోవడం పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరుస్తోంది.












Click it and Unblock the Notifications