"హరిహర వీరమల్లు" సినిమాలో కట్ చేసిన సీన్లు ఇవే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పీరియడిక్ డ్రామా 'హరి హర వీరమల్లు' చివరకు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. నిన్న ( జూలై 24, 2025 ) ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ రాజు ఔరంగ జేబుగా ఓ కీలక పాత్రలో నటించాడు. సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, విక్రమ్ జీత్ కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీకి మనోజ్ పరమహంస, సంగీతానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి అందించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు కలిపి ఈ సినిమా 70 కోట్ల గ్రాస్, 32.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. హైదరాబాద్, విజయవాడ వంటి సెంటర్లలో టికెట్లకు భారీ డిమాండ్ ఉండగా, మొదటి రోజు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కలిపి 12.7 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. పవన్ కెరీర్‌లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటివరకు రావడం ఇదే తొలిసారి. కానీ క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించినా, తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్‌ పుట్‌పై ప్రభావం చూపిందని అంటున్నారు. జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వస్తున్నాయి.

harihara-veeramallu-movie-team-cuts-vfx-secenes-after-trolling

వీఎఫ్‌ఎక్స్ పై ట్రోలింగ్..

'వీరమల్లు'గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్సులు, "కొల్లగొట్టినాదిరో" పాట, పోర్ట్ ఫైట్ సీన్, చార్మినార్ ఫైర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ సెకండ్ హాఫ్‌లో కథనం కొంచెం సాగదీతగా అనిపించడం, వీఎఫ్‌ఎక్స్ బలహీనంగా ఉండటం, పవన్ లుక్స్ కొన్నిచోట్ల సింక్ కాకపోవడం వంటి అంశాలు విమర్శలకు కారణమయ్యాయి.

సోషల్ మీడియాలో వీఎఫ్‌ఎక్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన VFX సన్నివేశాలు లేవని విమర్శకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే ఒకే సన్నివేశాన్ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ నాలుగు సందర్భాల్లో చూపించడం విమర్శలకు తావిచ్చింది.

harihara-veeramallu-movie-team-cuts-vfx-secenes-after-trolling

20 నిమిషాల సీన్లు కట్..

వెంటనే స్పందించిన మూవీ టీమ్ సెకండ్ హాఫ్‌లోని హార్స్ రైడింగ్ సీన్, తోడేలు సీన్, కోహినూర్ వజ్రం జర్నీ సీన్స్ వంటి వీఎఫ్‌ఎక్స్ లోపాలు ఉన్న సన్నివేశాలను తొలగించింది. ముందు 2 గంటల 42 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలకి కుదిరింది. సీన్ల మధ్య లింక్ కట్ కాకుండా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ కట్ చేసిన కొత్త వెర్షన్ నిన్న రాత్రి నుంచే థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+