పక్క సినిమాలని ఎగేసుకుంటూ చూస్తాం - హరీష్ శంకర్

హరీష్ శంకర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాక్ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన పలు సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత నుంచి ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులకు నిరాశనే మిగుల్చాయి. చివరగా ఆయన రవితేజతో చేసిన 'మిస్టర్ బచ్చన్' అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్. సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియా లోనూ, పలు కార్యక్రమాల్లోనే కనిపిస్తూ ఉంటారు హరీష్.

అయితే ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఇప్పటికే పలు మార్లు ఈవెంట్ లలో ప్రెస్ మీట్ లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన హరీష్ ఇప్పుడు కూడా అలానే వ్యాఖ్యానించారు. గతంలో డ్రాగన్ సినిమా ఈవెంట్‌లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు తెలుగు సినిమాలు కాకుండా పక్క భాషల చిత్రాల్ని హిట్ చేస్తుంటారు అని అన్నారు. ఆ వ్యాఖ్యలతో హరీష్ శంకర్‌కు ఫుల్ డ్యామేజ్ జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అలానే తన స్టైల్ లో మాట్లాడి.. విమర్శల పాలవుతున్నారు.

harish-shankar-shocking-comments-on-telugu-audience-at-jinkhana-event

గత కొంతకాలంగా మలయాళం సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. నసీన్, మమితా కలిసి నటించిన "ప్రేమలు" చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ఆ మూవీ హీరో నస్లీన్.. మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యాడు. ఆయన నటించిన మలయాళ చిత్రం 'అలప్పుజ జింఖానా' మూవీ తెలుగులో 'జింఖానా' పేరుతో థియేటర్లో విడుదల కానుంది.

ఈ క్రమంలోనే నిర్వహించిన ఈవెంట్ కి హరీష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పక్క సినిమాలను ఎంకరేజ్ చేయడం మనకు అలవాటే కదా, మన సినిమాలు మనం చూడకపోయినా కూడా పక్క సినిమాలని ఎగరేసుకుంటూ వెళ్లి చూస్తారు. తెలుగు సినిమాలు పట్టించుకోరు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

దీంతో ఇక ఈ వ్యాఖ్యల మీద నెటిజన్లు మండిపడుతున్నారు. పక్క భాషల సినిమాలు రీమేక్ చేసే మీరే ఈ మాటలు మాట్లాడుతున్నారా? అంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. మీ సినిమా ఎంకరేజ్ చేసి హిట్ చేసింది కూడా తెలుగు జనాలే అని మర్చిపోయారా అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+