షూటింగ్ లో కంట్రోల్ తప్పి.. ముద్దు పెడుతూ అక్కడ చెయ్యి వేశాడు

ప్రముఖ బాలీవుడ్ నటి 'అనుప్రియా గోయెంకా' టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. 2013లో మంచు మనోజ్ సరసన 'పోటుగాడు' సినిమాలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో బాబీ జాసూస్‌ సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా హిందీలో టైగర్ 3, పద్మావత్, వార్ సహా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో సైతం నటించి సత్తా చాటుతోంది. అసుర్, ఆశ్రమ్, పాంచాలి లాంటి వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది.

అయితే సినిమా అనేది రంగుల ప్రపంచం అయినప్పటికీ.. కనిపించని చీకటి కోణాలు సైతం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఎక్కువగా ఆ తరహా ఘటనలను ఎదుర్కొంటూ ఉంటారు. అవకాశాల ఇస్తామని కొందరు, డబ్బు ఆశ చూపి మరికొందరు సహా షూటింగ్ సమయాల్లో కూడా కొందరు అడ్వాంటేజ్ తీసుకునేందుకు యత్నిస్తూ ఉంటారని పలువురు హీరోయిన్లు ఓపెన్ గానే కామెంట్స్ చేశారు.

he-lost-control-during-in-the-shooting-actress-anupriya-goenka-shocking-comments

ఈ క్రమంలోనే ఇప్పుడు 'అనుప్రియా గోయెంకా' సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ మొదట్లో జరిగిన కొన్ని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఒక సినిమాలో ఇంటిమేటెడ్ సీన్ షూటింగ్ చేస్తున్న తరుణంలో తనతో పాటు ఉన్న నటుడు.. నడుము మీద పట్టుకొని లిప్ కిస్ చేయాలి అని తెలిపింది. అదే విషయం సీన్ పేపర్ లో కూడా రాసి ఉందని చెప్పింది.

కథ డిమాండ్ చేయడంతో తాను కూడా అందుకు ఓకే చెప్పానని.. కానీ షూట్ చేసే సమయంలో ఆ నటుడు ముద్దు పెట్టుకుంటూ.. తనను తాకరాని చోట తాకాడు అని వాపోయింది. అప్పుడు తనకు చాలా బాధ అనిపించిందని.. కానీ అతడికి చెప్తే కచ్చితంగా అనుకోకుండా తగిలి ఉంటుందని చెప్పేవాడని.. అందుకే తానేమి మాట్లాడలేదని వెల్లడించింది. ఆ సీన్ లో అతను ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడని.. తాను మాత్రం చాలా కంట్రోల్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలా తనకు జరగడం అది రెండో సారి అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇక రీసెంట్ గానే అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. బట్టలు మార్చుకుంటున్న వ్యానిటీ వ్యాన్ లోకి డోర్ కొట్టి రాకుండా డైరెక్ట్ గా ఒక దర్శకుడు లోపలికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని వాపోయింది. ఇలా వరుసగా హీరోయిన్స్ తమకు ఎదురైన ఘటనలను బయటపెట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+