ఏంది ఈ చండాలం.. ఈ డాన్స్ షో కన్నా రికార్డింగ్ డాన్స్‌లు నయం !
సినిమాలతో పాటు టీవి అనేది కూడ బలమైన ప్రసార మాధ్యమం. అయితే మారుతున్న కాలానుగుణంగా గత కొన్నేళ్లుగా బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ హద్దుమీరుతున్నాయి అనడంలో సందేహం అక్కర్లేదు. అవి కామెడీ షో లు కావొచ్చు, డాన్స్ షో లు కావొచ్చు ఇలా షో ఏదైనా కానీ అడల్ట్ జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగా ఎక్కువయ్యాయి. చేసిందే చూస్తారులే జనం అన్నట్టుగా ఒక హద్దు అనేది లేకుండా రెచ్చిపోతున్నాయి పలు ప్రోగ్రామ్స్.
ఇన్నాళ్లు ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షోస్ లో.. డ్యాన్స్ చేయమంటే కంటెస్టెంట్స్ సర్కస్ ఫీట్స్ చేయడం పరిపాటిగా వస్తుంది. డ్యాన్స్ చేయమంటే సర్కస్ ఫీట్స్, స్టేజ్ మీదే రొమాన్స్ .. సంబంధం లేని పాటకు సంబంధం లేని స్టెప్పులు ఇలా ఎన్నో ఘోరాలు చూశాం. మరి ముఖ్యంగా పాటకు డాన్స్ కు సంబంధం లేకపోవడం తర్వాత సంగతి.. లేడీ కంటస్టెంట్స్ బట్టలు.. వారి డాన్స్ ... సారీ సారీ అది డాన్స్ అనడం తప్పు ... అవయవాల ప్రదర్శన జరుగుతుందా అనే అనుమానం వస్తుంది.

అంతే కాకుండా అవి ఎక్స్ ప్రెషన్స్ అనాలో.. ఇంకేం అనాలో తెలియని రీతిలో మొహం పెట్టి.. కామమో, మరి ఇంకేదో అర్ధం కానీ స్థితిలో ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకు జడ్జెస్, యాంకర్స్ మిగతావారి రియాక్షన్ అయితే మరో హైడ్రామా. ఇవి అన్ని ఓల్డ్ అయిపోయాయి అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు కొత్తగా మరో చండాలానికి తెరలేపారు.
ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే డాన్స్ షో లో ఇలాంటివి ఎక్కువగా జరిగేవి. అందుకే గత రెండు మూడు సీజన్స్ నుండి ఈ షో ని చూడడం జనం ఆపేసారు. అందుకే ఈ సీజన్ లో కాస్త రూట్ మార్చారు అనుకోని జనం చూడడం స్టార్ట్ చేస్తున్నారో లేదో.. ఇప్పుడు ఒక పర్ఫామెన్స్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బట్టలు లేకుండా, కేవలం బాత్రూం టవల్ తో క్రింది భాగాన్ని కవర్ చేసుకుంటూ ఈ డ్యాన్స్ స్టెప్స్ ని కంపోజ్ చేశారు. ఈ పాటకు జడ్జీల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో ని సోషల్ మీడియా లో రిలీజ్ చేస్తే ఫుల్ వైరల్ అయ్యింది. ఈ వారంలో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతుంది.
అయితే సదరు డాన్సర్ ఒక సీజన్ విన్నర్. అంతే కాకుండా మంచి పర్ఫార్మర్.. చాలా చక్కగా డాన్స్ చేయగలడు. మరి అలాంటి వ్యక్తిత్వ ఈ తరహా డాన్స్ ఏంటని విమర్శలు వస్తున్నాయి. కానీ మరో వర్గం మాత్రం బాగా మేనేజ్ చేశారు.. మొత్తం సాంగ్ చూడడానికి వే అంటూ తెగ పొగిడేస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications