ఏమైందన్నా నీకు.. జూనియర్ ఎన్టీఆర్ లుక్ పై ట్రోల్స్
RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తారక్.. పలు బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఆయన చేసిన కారణంగా ఇప్పుడు ఫుల్ గా ట్రోల్ అవుతున్నారు.
ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కంపెనీలలో ఒక క్విక్ కామర్స్ సంస్థ కూడా ఉంది. సదరు సంస్థకు సంబంధించి లేటెస్ట్ గా ఒక యాడ్ రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ బ్లూ కలర్ హుడీ ధరించి.. గుబురు గడ్డం మీసాలు, షార్ట్ హెయిర్ తో ఆయన కొత్త లుక్ లో కనిపించారు. అయితే ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ అసలు బాగోలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. ఇదెక్కడి లుక్ రా బాబు అంటూ ఘాటుగానే కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.

ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. అలానే ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' మూవీలో నటిస్తున్నారు. ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారట.
ఆ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి ఏకంగా 500 మంది డాన్సర్లను రంగంలోకి దించుతున్నట్టు టాక్ నడుస్తోంది. యష్‌రాజ్ స్టూడియోలో ప్రస్తుతం ఈ డ్యాన్స్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా.. ఈ సాంగ్‌ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. వార్ 2 తర్వాత దేవర 2, ఎన్టీఆర్31 చిత్రాలు చేయనున్నట్టు సమాచారం.
మరోవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండేళ్ల నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. రీసెంట్ గానే భారీ సెట్ లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.












Click it and Unblock the Notifications