Heera mandi: నెట్‌ఫ్లిక్స్ ను షేక్ చేస్తున్న హీరామండి.. వారికి కోట్లలోనే రెమ్యునరేషన్!!
సంజయ్ లీలా భన్సాలీ తొలి వెబ్ సీరీస్ హీరామండి వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. హిందీలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర మొత్తం 14 భాషలలోను స్ట్రీమింగ్ అవుతోంది.
70 కోట్ల పారితోషకం తీసుకున్న సంజయ్ లీలా భన్సాలీ?
అత్యంత అద్భుతంగా సాగిన కథనంతో, స్వాతంత్రోద్యమానికి పూర్వం హీరామండి లోని వేశ్యల జీవితాన్ని, వారి జీవితంతో ముడిపడిన స్వతంత్ర పోరాటాన్ని గొప్పగా చూపించారు సంజయ్ లీలా భన్సాలీ. అయితే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది . భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించిన సంజయ్ లీలా భన్సాలీ దీనికోసం 70కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్టు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.

నటీమణులలో హైయ్యస్ట్ రెమ్యునరేషన్ సోనాక్షీ సిన్హాకే
నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ కోసం భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్లో మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, సంజీద షేక్, షర్మిన్ సెగల్ ప్రధానపాత్రలు పోషించారు. ఇక వీరందరిలోనూ హైయెస్ట్ రెమ్యునరేషన్ సోనాక్షి సిన్హా అందుకుందని సమాచారం. వెబ్ సిరీస్ లో నటించినందుకు సోనాక్షిసిన్హాకు ఏకంగా రెండుకోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఫరీదాన్ పాత్రలో సోనాక్షిసిన్హా అద్భుతంగా నటించింది.
మనీషా కొయిరాల, అదితిరావు హైదరీ.. రెమ్యునరేషన్ ఇలా
ఇక మల్లికాజాన్ పాత్రలో నటించిన మనీషా కొయిరాలకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో మరో కీలక పాత్రను పోషించిన అదితిరావు హైదరికి కోటిన్నర రూపాయల పారితోషికం ఇచ్చినట్టుగా సమాచారం అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్డాకు కోటి రూపాయలు , వహీదాగా నటించిన సంజీదా షేక్ కు నలభై లక్షలు, ఆలంజేబ్ గా నటించిన షర్మిన్ సెగల్ కు 35లక్షలు పారితోషికంగా ఇచ్చినట్టు సమాచారం.
నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేస్తున్న హీరామండి
ఈ వెబ్ సిరీస్ కు మోయిన్ బేగ్ కథ అందించగా, సంజయ్ లీలా భన్సాలీ దీనిని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ కు సంగీతాన్ని అందించి, ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఓటీటీ లో దుమ్మురేపుతున్న ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేస్తుంది. ఈ వెబ్ సీరీస్ పై నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications