నాగార్జున వదులకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా మన్మథుడిగానే కొనసాగుతున్నారు. యువ హీరోగా ఉన్నప్పుడే ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు. ప్రస్తుతం గతంలోకంటే జోరుగా సినిమాలు చేయనప్పటికీ ఆచితూచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు తర్వాత రెండు సినిమాలు ఫ్లాపవడంతో నా సామిరంగ చేసి విజయం అందుకున్నారు. వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమాతో రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

తన కెరీర్ లో అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమాలు చాలావరకు వదులుకున్నారు. డేట్లు ఖాళీ లేకపోవడంతోపాటు కథ నచ్చినా కొన్ని కారణాలవల్ల చేయడం వీలుపడక వదులుకోవాల్సి వచ్చింది. వాటిల్లో దళపతి, బద్రి, కలిసుందాం రా, మౌనరాగం, మెకానిక్ అల్లుడు, ఘర్షణ.. తదితర ఎన్నో సినిమాలు వదులుకున్నారు. దళపతిలో నాగార్జునను రజనీకాంత్ క్యారెక్టర్ చేయమని మణిరత్నం ముందుగానే అడిగారు. కానీ చేయలేదు. అలాగే మెకానిక్ అల్లుడులో చిరంజీవి పాత్ర చేయాల్సి ఉన్నప్పటికీ బి.గోపాల్ తో అంతకుముందు తనకు ట్రాక్ రికార్డు సరిగా లేకపోవడంతో ముందుకు రాలేదు.

hero akkineni nagarjuna missed somany block buster movies

బద్రి సినిమా కథ పూరీ ముందుగా నాగార్జునకు చెప్పినప్పటికీ ఎటువంటి సమాధానం రాకపోవడంతో పవన్ కల్యాణ్ తో చేశారు. తర్వాత పూరీ నాగ్ తో శివమణి చేశారు. వెంకటేష్ చేసిన కలిసుందాం రా, ఘర్షణ కథలు కూడా ముందుగా దర్శకులు నాగార్జున వద్దకు తీసుకువెళ్లారు. కానీ కొన్ని కారణాలవల్ల చేయలేకపోయారు. అవి మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇలా తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు నాగార్జున వదులుకోవాల్సి వచ్చింది. తన తనయులైన నాగచైతన్య హీరోగా స్థిరపడ్డాడుకానీ అఖిల్ మాత్రం ఇంకా నిలదొక్కుకోవాల్సి ఉంది. నిలబెట్టేందుకు నాగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+