Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభాస్ ఫ్యాన్స్ ను చితకబాదిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, పక్క రాష్ట్రంలో పరుగో పరుగో, వైరల్ వీడియో!

స్టార్ నటుల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగడం సర్వసాధారణం అయ్యింది. కామెంట్ల ద్వారా స్టార్ హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు అభిమానం మితిమీరిపోవడంతో వాళ్ల హంగామా చాలా ఎక్కువ అవుతుంది. ఇలాంటివి చివరికి చెడుకు దారితీస్తోంది. బెంగుళూరులో తెలుగు హీరోలు బాహుబలి ప్రభాస్, పుష్పా అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవ జరిగింది.

సినిమా హీరోల అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్బంగా, లేదంటే సినిమా విడుదలను పండుగలా జరుపుకుంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూస్తారు. కేక్‌లు కట్‌ చేసి, బ్యానర్‌లు కట్టి, కటౌట్‌లను అలంకరిస్తూ, బాణాసంచా కాల్చి ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. వారి సొంత సినిమా విడుదల అయ్యిందని, వాళ్ల పుట్టినరోజు జరిగింది అన్నట్లుగా హీరోల అభిమానులు భారీగా వేడుకలు నిర్వహించడం చాలా సంవత్సరాల నుంచి అనవాయితీగా వస్తోంది.

Hero Allu Arjun fans attacked hero Prabhas fans in Bengaluru

హీరోలు అంటే ఇష్టాలకే పరిమితమైతే ఫర్వాలేదు. కొన్నిసార్లు వేడుకల సమయంలో కూడా ప్రమాదాలు జరిగి అభిమానులు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు స్టార్ హీరోలు అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్‌లకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరికీ దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. తాజాగా బెంగుళూరులో క్రికెట్ ఆడుతూ అల్లు అర్జున్, ప్రభాస్ అభిమానులు కొట్లాడుకుంటున్న సమయంలో తీసిన వీడియో వైరల్ అవుతోంది.

పనికిమాలిన పని కారణంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, తరువాత ఆ పని చేతుల వరకు మారింది. ప్రభాస్ అభిమానిని కొందరు అల్లు అర్జున్ అభిమానులు కొట్టారనే వీడియో బయటకు రావడంతో అది వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ అభిమానులుగా చెప్పుకునే నలుగురైదుగురు వ్యక్తులు ప్రభాస్ అభిమాని అని అంటున్న ఓ వ్యక్తి మీద దాడి చెయ్యడంతో అతని ముక్కులో, నోటీలో రక్తం కారింది. రక్తం కారేలా కొందరు ఓ వ్యక్తి మీద దాడి చేసిన వీడియో బటకు రావడంతో అది వైరల్ అయ్యింది.

జై అల్లు అర్జున్ అని నినాదాలు చేస్తూ ఓ వ్యక్తిని కొట్టినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్టార్ నటీనటుల మధ్య మంచి స్నేహబంధం ఉంది. అయితే హీరోల మీద ఉండే పిచ్చి అభిమానంతో కొందరు ఇలా చేస్తుంటారు. మన అభిమాన నటుడి కంటే మరొక హీరో ఎక్కువ అని ఎవరైనా అంటే ఆవేశంతో ఊగిపోతుంటారు. అలాగే ఇతర హీరోల అభిమానులు కొందరు ఆటపట్టిస్తూ ఉంటారు.

ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోస్టార్ హీరోల అభిమానులు ఒకరి ఒకరు దూషించుకోవడమే కాకుండా పరస్పరం దాడులు చేసుకోవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం బెంగళూరులో ఇద్దరు తెలుగు హీరోల అభిమానులు కొట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అలాంటి ఘటనన బెంగళూరులో చోటుచేసుకుంది. మళ్లీ ఇంకోసారి మా తంటకు వస్తే నీకథ చూస్తామని అల్లు అర్జున్ అభిమానులు హెచ్చరించినట్లు వీడియోలో ఉందని కన్నడ మీడియా తెలిపింది.

అల్లు అర్జున్ గురించి తప్పుగా మాట్లాడినందుకే ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఈ విధంగా దాడి జరిగిందని వెలుగు చూసింది. ఎవరో ఈ వీడియోను బెంగళూరు పోలీస్‌ లకు ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తి కోరారు. బెంగళూరు పోలీసులు ఈ వీడియో ఆధారం విచారణ చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఇద్దరు తెలుగు స్టార్ హీరోల అభిమానులు పొరుగు రాష్ట్రంలో ఇలా దాడులు చేసుకోవడంతో కన్నడిగులు నవ్వుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+