తమన్ కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ - విలువ ఎంతో తెలుసా..!!
నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఖరీదైన బహుమతి ఇచ్చారు. బాలయ్య - తమన్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య సినిమాల కంటే మంచి రిలేషన్ ఉంది. బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అనే విధంగా వీరిద్దిరి కాంబో హిట్ అయింది. తాజాగా బాలయ్య సినిమా డాకూ మహరాజ్ సినిమా హిట్ అయింది. బాలయ్యకు పద్మభూషన్ అవార్డు రావటంతో సోదరి భువనేశ్వరి ఏర్పాటు చేసిన పార్టీలోనూ తమన్ కు స్పెషల్ గుర్తింపు దక్కింది. ఇప్పుడు బాలయ్య ఊహించని గిఫ్ట్ ఇవ్వటం వైరల్ గా మారింది.
తమన్ కు బాలయ్య ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. బాలకృష్ణ తాజాగా మ్యాజిక్ డైరెక్టర్ తమన్‌కు ఓ ఖరీదైన కానుక ఇచ్చారు. ఆ కారు ధర కోటికి పైగానే ఉంటుందని చెబుతున్నారు. న్యూ బ్రాండెండ్ పోర్చ్సే కారును బాలయ్య స్వయంగా కొని.. రిజిస్ట్రేషన్ చేయించి మరీ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, కొత్త కారుతో బాలయ్య, తమన్ దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తమన్‌ను నందమూరి కాంపౌండ్ ఓన్ చేసుకుంది. స్వయంగా నారా భువనేశ్వరి సైతం ఆయన్ను నందమూరి తమన్ గా పేర్కొన్నారు.

A bond beyond cinema! ❤️❤️#NandamuriBalakrishna garu gifted a grand Porsche car to our sensational @MusicThaman garu ❤️😍
— manabalayya.com (@manabalayya) February 15, 2025
Their bond keeps growing showing that respect and admiration go beyond movies 🫶🏻 pic.twitter.com/Hp8bk4QxQy
ఈ సాయంత్రం విజయవాడలో తమన్ ప్రత్యేక మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ తో పాటుగా భువనేశ్వరి, పలువరు ప్రముఖులు హాజరవుతున్నారు. బాలయ్య అభిమానులు తమన్‌ను నందమూరి తమన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానాన్ని చాటుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో డాకు మహరాజ్ విజయోత్సవ వేడుకల్లో బాలయ్య సైతం తమన్‌కు ఓ పేరు పెట్టారు. నందమూరి తమన్ కాదు.. ఎన్బీకే (నందమూరి బాలకృష్ణ) తమన్ అంటూ పేరు పెట్టారు. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 మూవీ తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications