యంగ్ హీరోయిన్ తో 'బెల్లంకొండ' పెళ్లి?

సినిమా పరిశ్రమలో ఈ మధ్య స్టార్ హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు చిన్న వయసులోనే వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడిపోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంతతో కూడా నటించాడు. ప్రస్తుతం పరిశ్రమలోని ఒక యంగ్ హీరోయిన్ ను సాయి ప్రేమిస్తున్నాడని, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నాడని తెలుస్తోంది. జనవరి 3వ తేదీ తన పుట్టినరోజు కాబట్టి ఆరోజు అధికారికంగా ప్రకటించబోతున్నాడనే వార్త వైరలవుతోంది. ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుంది. దీనిపై బెల్లంకొండ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

hero Bellamkonda saisrinivas wedding with young heroine?

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన సాయిశ్రీనివాస్ లాస్ ఏంజిల్స్ (USA)లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో, ముంబయిలోని బారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేశాడు. మార్షల్ ఆర్ట్స్, స్టంట్స్ కోసం వియత్నాంలో వృత్తిపరమైన శిక్షణ తీసుకున్నాడు. అతని తమ్ముడు బెల్లంకొండ గణేష్ నటుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+