ఓటీటీని కొనుగోలు చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరంలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగానే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా అవతరించాడు. ఆ సినిమాలో తారక్ నటనకు అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికిముందుగా వార్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో ఇండియన్ ఏజెంట్ గా నటిస్తున్నట్లు సమాచారం.

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించాడు. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఓ ఓటీటీ నుంచి తారక్ కు ఓ ఆఫర్ అందినట్లు తెలుస్తోంది. టాక్ షో ఒకటి ప్రారంభిస్తున్నామని, దానికి హోస్ట్ గా వ్యవహరించాలని కోరారు. అందుకు అవసరమైతే రెమ్యునరేషన్ ఇస్తారా? లేదంటే ఓటీటీలో భాగస్వామ్యం ఇస్తారా? అనే చర్చ నడుస్తోంది. రెమ్యునరేషన్ గురించి అటువైపు పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఓటీటీ అయితే భాగస్వామిగా ఉండటంతోపాటు కార్యక్రమాల రూపకల్పన, సినిమాల కొనుగోలు, వెబ్ సిరీస్ ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

hero junior ntr will purchase ott platform

ఇదంతా భారీ వ్యయంతో కూడుకొని ఉంటుంది. ఆఫర్ ఇచ్చిన ఓటీటీ సంస్థ ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే నడుస్తున్న సంస్థా? లేదంటే కొత్తగా వస్తుందా? లేదంటే విదేశీ భాగస్వామ్యం ఏమైనా ఉందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఓటీటీ నిర్మాణంవైపు దృష్టి సారిస్తారా? లేదంటే హోస్ట్ గా వ్యవహరించి పారితోషికం వరకే తీసుకుంటారా? అనే విషయంలో స్పష్టత రావాలి. సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్న తారక్ కు ఇతరత్రా ఏవైనా వ్యాపారాలున్నాయా? లేవా? అనే విషయాలు మాత్రం ఫిలింనగర్ లో ఎవరికీ తెలియదు. తన ఆర్థిక వివరాలన్నింటినీ ఎన్టీఆర్ అత్యంత గోప్యంగా ఉంచుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+