Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూనియర్ ఎన్టీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ

నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయనే సంగతి తెలిసిందే. కొంతకాలం బాగుంటారు.. మరికొంతకాలం బాగుండరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఒక జట్టుగా ఉన్నారు. బంధువుల వేడుకలు జరిగినా ఇద్దరూ సంయుక్తంగానే హాజరవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబ సభ్యుల్లో కొందరు దూరం పెట్టారు. వారిలో బాలకృష్ణ ఒకరు. తరుచుగా పరోక్షంగా తారక్ పై ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తుంటారు. దీంతో తారక్ ఎవరితో కలవకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వాటిపైనే ఎక్కువ దృష్టిసారించారు.

ఆయన బాటలో నడవాలి..
తాజాగా కాజల్ అగర్వాల్ నటించి సత్యభామ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా దానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షరా మాములుగానే సినిమా గురించి, కాజల్ గురించి మాట్లాడిన తర్వాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. నందమూరి తారకరామారావు వారసులు అంటే ఆయన పేరు చెప్పుకోవడం కాదని, ఆయన నటించిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదన్నారు. తాము ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నామా? లేదా? అనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ కు, బాలయ్యకు కొన్నాళ్ల నుంచి పడటంలేదు. తారక్ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ బాలకృష్ణ మాత్రం పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.

hero nandamuri balakrishna counter to junior ntr

కొడాలి నాని, వంశీ వల్లే..
ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. వారిని తారక్ కావాలనుకుంటే నియంత్రించగలడని, కానీ అటువంటిదేమీ చేయకుండా సైలెంట్ గా ఉండటంతో టీడీపీ శ్రేణులు కూడా తారక్ ను లక్ష్యంగా ఎంచుకున్నాయి. పార్టీ సమావేశాల్లో, సభల్లో ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కూడా కనిపించడంలేదు. మరి వీరిమధ్య విభేదాలు ఎప్పటికి చల్లారతాయో చూడాలి మరి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+