నారా రోహిత్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ తెలుసా? భువనేశ్వరికి ఏం చెప్పాడంటే?
నారా రోహిత్ తనతోపాటు ప్రతినిధి2 సినిమాలో నటించిన హీరోయిన్ సిరి లెల్లా తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 13వ తేదీన హైదరాబాద్ నోవాటెల్ లో జరిగిన ఈ వేడుకకు నారావారి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరై రోహిత్ ను, సిరిని ఆశీర్వదించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడి కుమారుడే రోహిత్. తనకు ఓ అన్న కూడా ఉన్నాడు. తనకీ వివాహం కాలేదు. ప్రతినిధి2 సినిమా సమయంలో సిరితో ప్రేమలో పడటంతో ఈ విషయాన్ని తన పెద్దమ్మ నారా భువనేశ్వరికి రోహిత్ చెప్పాడు.
సిరి కాక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు
ఆమె చంద్రబాబుకు చెప్పడం, ఆ తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడిన భువనేశ్వరికి పెళ్లికి ఒప్పించారు. డిసెంబరులో వీరి వివాహం జరగబోతోంది. సిరి లెల్ల స్వగ్రామం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల నియోజకవర్గంలోని దైద. ప్రస్తుతం ఇది పల్నాడు జిల్లాకింద ఉంది. వీరి కుటుంబం దైద నుంచి రెంటచింతలకు వలస వచ్చాడు. సిరితోపాటు మరో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. సిరి పెద్దక్క అంగన్ వాడీ సూపర్ వైజర్ గా పనిచేస్తుండగా, రెండో అక్కడ భవానీ వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడింది. మూడో అక్కడ ప్రియాంక వివాహం చేసుకొని హైదరాబాద్ స్థిరపడింది.

సిరి అదృష్టవంతురాలు
సిరి తండ్రి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. తల్లి గృహిణి. హైదరాబాద్ లో విద్యనభ్యసించిన తర్వాత సిరి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ మోడల్ గా మారింది. తన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో గుర్తింపు వచ్చింది. అక్కడే షార్ట్ ఫిలింస్ లో కూడా నటించింది. తిరిగి హైదరాబాద్ వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ప్రతినిధి2కు ఎంపికైంది. తొలి సినిమా సమయంలోనే తొలి హీరోతోనే ప్రేమలో పడి వివాహం చేసుకోబోతోంది. నారావారి ఇంటికి కోడలిగా వెళ్లబోతోందంటే సాధారణ విషయం కాదని నెటిజన్లు అంటున్నారు. ఏదైనప్పటికీ లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేసే నారా రోహిత్ ను వివాహం చేసుకోవడం సిరి అదృష్టమని వ్యాఖ్యలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications