జెంటిల్ మెన్, ఒకేఒక్కడు వదులుకున్న తెలుగు స్టార్ హీరో
హీరోలు వేరే సినిమాలు చేస్తున్న సమయంలో వారి దగ్గరకు కొన్ని కథలను తీసుకొని దర్శకులు వస్తుంటారు. కథలు బాగా నచ్చి సినిమా చేయాలనుకుంటారుకానీ కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతోపాటు కథల్లో మార్పులు చేర్పులు నచ్చక తిరస్కరించడం లాంటివి జరుగుతుంటాయి. ఆ సినిమాలు వేరే హీరోలు దగ్గరకు వెళ్లి వాళ్లు స్టార్ హీరోలుగా చెలామణి అయ్యేంతగా కెరీర్ ను మలుపు తిప్పుతుంటాయి. ఆ తర్వాత అయ్యో.. ఆ సినిమాలు చేయకుండా ఎంత తప్పు చేశాం.. చేసినా బాగుండేదే అనుకుంటూ హీరోలు వాపోతుంటారు.
అలాగే దక్షిణాదిలో టాప్ డైరెక్టర్ గా చెలామణి అవుతున్న శంకర్ సినిమాల్లో నటించేందుకు హీరోలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కథతోపాటు సినిమాలో మెసేజ్ కూడా ఇస్తుంటారు. అటువంటిది శంకర్ తాను దర్శకత్వం వహించిన జెంటిల్ మెన్ చిత్రాన్ని ముందుగా రాజశేఖర్ తో చేద్దామనుకున్నారు. కలిసి కథ వినిపించినప్పటికీ ఎందుకనో రాజశేఖర్ దాన్ని తిరస్కరించారు. తర్వాత ఆ సినిమా భారీ హిట్ అయి అర్జున్ కెరీర్ నే మలుపు తిప్పింది. తర్వాత శంకర్ ఒకేఒక్కడు సినిమాను కూడా రాజశేఖర్ తోనే తీయాలనుకున్నారు.

వేరే సినిమాలతో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమాను కూడా రాజశేఖర్ వదులుకున్నాడు. ఒకే ఒక్కడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీన్నిబట్టి రాజశేఖర్ ఎంతో దురదృష్టవంతుడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ రెండు సినిమాలను చేసుంటే రాజశేఖర్ ఇప్పటికే స్టార్ హీరోగా సూపర్ రేంజ్ లో నిలిచేవాడంటున్నారు. దురదృష్టం వెంటాడటంతో ప్రస్తుతం పరిశ్రమ నుంచి తెరమరుగయ్యే పరిస్థితి వచ్చిందని అభిమానులు అంటున్నారు. ఇటీవలే ఒక సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన ఈ యాంగ్రీ యంగ్ మేన్ మరో కుర్ర హీరోకు తండ్రిగా నటించబోతున్నాడంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications