ఎంత ప్రేమో... బయటపడ్డ సుకుమార్ వాట్సాప్ చాట్
సుధీర్ బాబు తాజాగా మానాన్న సూపర్ హీరో పేరుతో ఓ సినిమా చేశారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరినీ బాగా ఆకట్టుకుంటోంది. హీరో నాని అయితే దీన్ని చూసిన తర్వాత సుధీర్ బాబుకు ప్రత్యేకంగా ఓ వాయిస్ మెసేజ్ పంపించారు. తాజాగా ఈ జాబితాలో మరో ప్రముఖుడు చేశారు. ఆయనే దర్శకుడు సుకుమార్. ఆయన కూడా మానాన్న సూపర్ హీరో టీజర్ చూసి స్పందించారు. తర్వాత ఆయన వాట్సాప్ లో సుధీర్ బాబుకు మెసేజ్ చేయడంతోపాటు చాటింగ్ చేశారు.
ఆనందంగా ఉందన్న సుకుమార్
టీజర్ లో హావభావాలు చాలా చాలా బాగున్నాయని, ఇలాంటి పాత్రల్లో నువ్వు నటిస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ సుకుమార్ మెసేజ్ చేశారు. తనకు ఇంతమంది కాంప్లిమెంట్ ఇచ్చినందుకు సుకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మీ వాట్సాప్ డీపీలో మీ నాన్నగారి ఫొటో ఉంటుందని, దాన్ని చూస్తేనే ఆయనంటే మీకు ఎంత ప్రేమో అర్థమవుతోందని, మానాన్న సూపర్ హీరో సినిమా కూడా ఫాదర్ ఎమోషన్ గురించే తీశామని సుధీర్ బాబు సుకుమార్ కు సమాధానం ఇచ్చారు. ఇది చాలా విభిన్నమైన కథ అని అర్థమవుతోందంటున్నారు సినీ ప్రముఖులు.

టీజర్ లో చాలా తక్కువ డైలాగులు
టీజర్ లో చాలా తక్కువ డైలాగులున్నాయి. సుధీర్ బాబు కూడా ఎంతో ఆకట్టుకున్నాడు. దీన్ని దాదాపుగా టాలీవుడ్ ప్రముఖులంతా ఫిదా అయ్యారు. అందుకే సుకుమార్ చాలా ప్రత్యేకంగా దీన్నిగురించి మాట్లాడారు. సుకుమార్ తనతో చేసిన వాట్సాప్ చాట్ ను సుధీర్ బాబు షేర్ చేశాడు. దర్శకుడు సుకుమార్ కు తన నాన్న అంటే ఎంతో ప్రేమ. తాను తీసే ప్రతి సినిమాకు చివరలో నాన్నకు ప్రేమతో అనే కార్డు వేస్తారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన సినిమాకు కూడా నాన్నకు ప్రేమతో అనే పేరు పెట్టారు. అందులో కూడా తండ్రిమీద సుకుమార్ కు ఉన్న ప్రేమ కనపడుతుంటుంది. అందుకే సుధీర్ బాబు సినిమాకు ఆయన బాగా కనెక్ట్ అయినట్లున్నారు.
-
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
వారణాసిపై సెటైర్లు- దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
పేటీఎం బ్యాచ్‌తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్











Click it and Unblock the Notifications