నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్
హీరోయిన్ అంజలి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె ఓ ప్రముఖ తెలుగు నిర్మాతతో పెళ్లికి సిద్దం అయిందనే వార్త ఇటీవల బాగా వైరల్ అయింది. తాజాగా తన పెళ్లిపై వస్తోన్న రూమర్స్‌పై ఈ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. అంజలి ప్రస్తుతం ''గీతాంజలి మళ్లీ వచ్చింది'' అనే సినిమాలో నటించింది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలీతో సరదాగా ప్రొగ్రామ్‌లో చిత్ర యూనిట్ సందడి చేశారు.
ఈ సందర్భంగా అలీ మీరు ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇందులో వాస్తవం ఎంత అని హీరోయిన్ అంజలిని ప్రశ్నించారు. దీనిపై అంజలి మాట్లాడుతూ... నాకు తెలియకుండా సోషల్ మీడియా ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు.ఇప్పుడు కూడా పెళ్లి చేస్తున్నారని ఈమె వెల్లడించారు.ఇలా నాకు పెళ్లయిందని వేరే ఇంట్లో ఉంటున్నట్టు వార్తలు రాశారు ఈ వార్తలు నా వరకు కూడా వచ్చాయని అంజలి తెలిపింది.

అయితే నిజం ఏంటంటే నేను ఎక్కువగా అవుట్ డోర్ షూటింగ్స్‌లో ఉంటున్నానని ఈ వార్తలతో నాకు ఎటువంటి సంబంధం లేదని అంజలి చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ ..తప్పకుండా తాను పెళ్లి చేసుకుంటానని అయితే దానికి కొంచెం సమయం ఉందని అంజలి తెలిపింది. పెళ్లి ఫిక్స్ అయితే ఆ విషయాన్ని తానే చెబుతానని అంజలి వెల్లడించింది. ఇక అంజలి కెరీర్ విషయానికి వస్తే..తెలుగు అమ్మాయి అయినప్పటికి తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కెరీర్ పీక్ టైం లో కుటుంబ గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరు కలిసి సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో షాకిచ్చింది. హీరో జైకు బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది.












Click it and Unblock the Notifications