స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్
పలువురు హీరోయిన్లు పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తులను వివాహం చేసుకుంటున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్యను ప్రేమించింది హీరోయిన్ శోభిత ధూళిపాళ. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. హీరోయిన్ హన్సిక సైతం అప్పటికే పెళ్లైన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. బాలనటిగా కెరీర్‌ను మొదలుపెట్టిన హన్సిక .. కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కాని అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2007, జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
బాక్సాఫీస్ వద్ద 'దేశముదురు' సూపర్ హిట్‌గా నిలిచింది. హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. 'దేశముదురు' సినిమా తర్వాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో కంటే కూడా ఎక్కువుగా ఈ అమ్మడు తమిళంలోనే సక్సెస్ సాధించింది. తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశం హన్సికకు దక్కింది. తమిళంలో ఆమెకు ప్రత్యేకమైన అభిమాణగణం ఉంది. అభిమానులు హన్సికకు గుడి కూడా కట్టారంటే ఆమె రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. పెళ్లి పీటలెక్కిసింది. సొహైల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. హన్సికకు ఇది మొదటి వివాహం కాగా సొహైల్‌కు మాత్రం ఇది రెండోది. హన్సిక మోత్వాని తన క్లోజ్ ఫ్రెండ్ రింకీ మాజీ భర్త సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. 2016లో రింకీతో సోహైల్ కతురియా మొదటి వివాహం జరిగింది. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. రింకీతో విడాకులు తీసుకున్న తర్వాత సోహెల్ ఖతురియా హన్సికతో ప్రేమలో పడ్డాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే సోహెల్‌ను కలిసినట్టు హన్సిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. వీరి పెళ్లికి హన్సిక స్నేహితురాలు రింకీ కూడా హాజరైనట్లు ఆమె తెలిపింది. 2022 డిసెంబర్ 4న జైపూర్‌లోని ముండోటా కోట ప్యాలెస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.












Click it and Unblock the Notifications