అనిరుధ్‌తో పెళ్లిపై కీర్తిసురేష్ సంచలనం... ఒప్పుకుంటాను!

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని సంగీత దర్శకుల్లో నెంబర్ వన్ గా చెలామణి అవుతున్నాడు అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోలంతా తమ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనిరుధ్ తోనే చేయించుకోవాలని ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తికాదు. ఇటీవలే వచ్చిన జైలర్, దేవర సినిమాలకు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం ఆ సినిమా విజయాల్లోకీలకపాత్ర పోషించింది. సంగీత దర్శకుడిగా మంచి నైపుణ్యం చూపించే అనిరుధ్ అమ్మాయిలను ప్రేమించడంలో కూడా అంతే నైపుణ్యంగా ఉంటాడని తమిళ మీడియా ఎప్పుడూ చెబుతుంటుంది. ప్రముఖ హీరోయిన్ గా చెలామణి అవుతున్న మహానటి కీర్తి సురేష్ తో అనిరుధ్ ప్రేమాయణంలో ఉన్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తనకు కేవలం మంచి స్నేహితుడు
ఎందుకంటే వీరిద్దరూ ప్రైవేటు పార్టీల్లో చాలాసార్లు మీడియా కంటపడ్డారు. దీంతో రూమర్లు విస్త్రతంగా వ్యాపించాయి. ఈ విషయమై కీర్తి సురేష్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, అనిరుధ్ రవిచందర్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, త్వరలోనే అతనికి, నాకు పెళ్లి జరగబోతోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అతను మంచి స్నేహితుడు అనే విషయాన్ని మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా ఒప్పుకుంటానని కీర్తిసురేష్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పెళ్లిపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, తమిళంలో వచ్చిన తెరి సినిమాకు హిందీ రీమేక్ బేబీజాన్ లో నటిస్తున్నట్లు చెప్పింది.

heroine keerthi suresh sensational comments on marriage with anirudh ravichander

తల్లిదండ్రులు బాధపడ్డారు
సామాజిక మాధ్యమాల్లో తనకు, అనిరుధ్ కు వచ్చే ఏడాది ప్రారంభంలో వివాహం జరగబోతోందని వస్తున్న వార్తలకు తల్లిదండ్రులు, తన కుటుంబ సభ్యులంతా బాధపడ్డారని చెప్పింది. ఇంత స్పష్టంగా కీర్తి సురేష్ వివరణ ఇవ్వడంతో అనిరుధ్-కీర్తి సురేష్ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడింది. అయినప్పటికీ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఆమెపై ఇలా వార్తలు రావడం కొత్తేంకాదు. తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా చాలా సన్నిహితంగా ఉంటోందంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. వాటిని కూడా ఆమె కొట్టేసింది. పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ పై కీర్తిసురేష్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇతర పార్టీలు ట్రోలింగ్ చేశాయి. ప్రస్తుతం బేబీజాన్ లో నటిస్తున్న కీర్తిసురేష్ తర్వాత చేయబోయే సినిమాను ఇంకా ప్రకటించలేదు. తెలుగులో ఉంటుందా? తమిళంలో ఉంటందా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+