బంపర్ ఆఫర్ పట్టేసిన జాక్ పాట్ బ్యూటీ
పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తొలి సినిమానే ఈ అమ్మడుకు మంచి టాక్ ను అందించింది. ప్రస్తుతం కుర్రాళ్లంతా మృణాల్ ఠాకూర్ పేరే జపిస్తున్నారు. దర్శక, నిర్మాతలు కూడా ఈ బ్యూటీకి సినిమాల్లో అవకాశాలిస్తున్నారు. ఆమె డేట్స్ ఆలస్యమైనా కావాలనే ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 6 సినిమాలు ఈ అందమైన అమ్మడు చేతిలో ఉన్నాయి. తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం పట్టేసిందనే వార్త పరిశ్రమలో వినపడుతోంది.
హీరో రాఘవ లారెన్స్ సరసన జోడిగా నటించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాఘవ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు 'శ్రీరామరక్ష' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో చురుగ్గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలన్నింటినీ షేర్ చేస్తుంటుంది. నాని సినిమా హాయ్ నాన్నతో మరో హిట్ ను ఈ బ్యూటీ తన ఖాతాలో వేసుకుంది.

కళాశాలలో చదువుతున్నప్పుడు స్టార్ ప్లస్ సిరీస్ ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్‌లో మోహిత్ సెహగల్ సరసన నటించింది. ఈ కార్యక్రమం 2012 నుండి 2013 వరకు ప్రసారం చేశారు. 2013లో మిస్టరీ థ్రిల్లర్ హర్ యుగ్ మే ఆయేగా ఏక్ - అర్జున్‌లో సాక్షి ఆనంద్ అనే జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రసీమతోపాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తున్నాయి. సినిమాల ఎంపికతో మృణాల్ ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంటుంది.












Click it and Unblock the Notifications