తల్లి కాబోతున్న సమంత..కారణం అతనేనా..?
హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె పూర్తిగా సినిమాలకు దూరం కావాలని చూస్తున్నారు.
ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది.ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు.

రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది.సమంతకు మళ్లీ పెళ్లీ చేసుకోవాలనే ఆలోచన లేదట.ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని..మరోసారి అలాంటి తప్పు జరగనివ్వనని సమంత తన ఫ్యామిలీకి చెబుతున్నారట. ఇకపై ఒంటరి జీవితాన్ని సాగించడానికే సమంత ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారట.
అయితే తల్లి కావాలనే తన ఆశను మాత్రం సమంత మరో విధంగా తీర్చుకోవాలని చూస్తున్నారు. ఓ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో సమంత ఉన్నారని తెలుస్తుంది. ఆ ఇద్దరి పిల్లలతో తన జీవితాన్ని కొనసాగించాలని సమంత భావిస్తున్నారట. సమంత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నాగ చైతన్యతో విడిపోవడం కూడా ఒక కారణమని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజం అయితే ..గర్వించదగ్గ విషయమే అని సమంతపై ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications