ఇంత అందాన్ని ఎలా మెయింటెయిన్ చేస్తోందిరా సామి..!

ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న హీరోయిన్స్ లిస్ట్‌లో సంయుక్త మీనన్ కూడా ఒకరు. నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. 'భీమ్లా నాయక్' ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ ఆ తరువాత విరూపాక్ష సినిమాతో స్టార్ హీరోయిన్‌గా నటించింది. బింబిసారా,సార్,డెవిల్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. తెలుగుతో పాటు, తమిళ , మళయాళ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది.

తెలుగులో నిఖిల్ 'స్వయంభూ' తో పాటు.. శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కూడా మూవీస్ ఓకే చేసినట్లు సమాచారం. ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం.భాష రాకపోవడం ఒక కారణం అయితే, మేకప్‌ మరో కారణమని తెలిపింది. వినడానికి వింతగా ఉన్నా కూడా నా వరకు అది చాలా పెద్ద విషయమని చెప్పుకొచ్చింది.

heroine Samyuktha Menon gym photos goes viral

మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్‌ వేసుకోవడం వెంటనే అయిపోతుంది.చాలా లైట్‌గా, సహజంగా వేస్తారు.యాక్టింగ్‌ చేసేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక తెలుగులో చాలా జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. తెరపై ఎలా కనిపిస్తామా అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలీ. ఎక్కువ మేకప్‌ వేస్తారు.షాట్‌ చేస్తున్నప్పుడు కూడా మేకప్‌ను చెక్‌ చేసుకోవాలి.అది నటించడానికి అంత కంఫర్ట్‌గా అనిపించదు. చర్మంపై ఏదో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ .. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఆ మధ్య ఇంటర్య్వూలో తెలుగు ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంయుక్త మీనన్ హాట్ హాట్ ఫొటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.

తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అమ్మడు జిమ్‌లో కష్టపడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సంయుక్త మీనన్ తన నడుము ఎక్కువ ఫోకస్ అయ్యేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. సంయుక్త మీనన్ ఫొటోస్‌లు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సంయుక్త ఇంత అందాన్ని ఎలా మెయింటెయిన్ చేస్తోందిరా సామి అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, సంయుక్త మీనన్ అందానికి ఎన్ని మార్కులు ఇచ్చిన తప్పు లేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం సంయుక్త మీనన్ జిమ్ ఫొటోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+