కల్యాణ్ రామ్ కు ఆ హీరోయిన్ ఎంతో సెంటిమెంట్?
నందమూరి హీరో కళ్యాణ్‌రామ్(nandamuri kalyanram) వరుస ప్లాపుల నుంచి గట్టెక్కి బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు.. సీతారామం లాంటి సూపర్ హిట్ సినిమా పోటీగా ఉన్నా కూడా రు. 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. సంయుక్త మీనన్ (samyuktha menon), కేథరిన్ థెస్రా హీరోయిన్లుగా నటించారు.
ఇటీవలి కాలంలో సంయుక్త మీనన్ అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లక్కీ హీరోయిన్ అనే పేరు సంపాదించుకుంది. సార్, భీమ్లానాయక్, విరూపాక్ష, బింబిసార లాంటి హిట్లతో దూసుకుపోతోంది. ఆమె మరోసారి కళ్యాణ్‌రామ్ డెవిల్ సినిమాలో నటించింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా స్వీయదర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా అనుకున్న నవీన్ మేడారంకు నిర్మాతకు పొసగడకపోవడంతో అభిషేక్ నామా తానే దర్శకుడిగా మారారు. కళ్యాణ్‌రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. సినిమా కథ, కథనాలు బాగున్నాయనే టాక్ పరిశ్రమలో నడుస్తోంది. యానిమల్ సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన హర్షవర్థన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సంయుక్త మీనన్ మరోసారి కళ్యాణ్‌రామ్ పాలిట లక్కీ హీరోయిన్ అవుతుందంటున్నారు. ఈ నెల 29న దీన్ని విడుదల చేస్తున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగా నటిస్తూనే నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. బింబిసార తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవరను మరో నిర్మాత మిక్కిలినేని సుధాకర్ తో కలిసి రూపొందిస్తున్నారు. బింబిసార్ 2 చిత్రం తీయడానికి జీ5తో ఒప్పందం ఉంది. అయితే డైరెక్టర్ వశిష్ట చిరంజీవితో చిత్రం రూపొందిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలోనే నిర్మిస్తారా? లేదా? అనేది తేలాలంటే మరో మూడునెలలు ఎదురుచూడక తప్పదు.
-
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications