కొడుకు వయసు 21 ,ప్రియుడి వయసు 33..ఈ వయస్సులో ఎందుకు ఆంటీ..?
బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. మలైకా హిందీ ఐటమ్ సాంగ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో కూడా మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించింది. 52 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. ఈ వయస్సులో కూడా తన అందాలను ఆరబోస్తుంటుంది. మలైకా జిమ్ వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అమ్మడు ఏ రేంజ్‌లో అందాలు ప్రదర్శిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
హాట్ హాట్ ఫోజులతో మలైకా కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది. మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది. అందాల ఆరబోతలో మలైకా ఎటువంటి హద్దులు పెట్టుకున్నట్టు అనిపించదు. సోషల్ మీడయాలో మలైకా రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తుంది. ఇక మలైకా అరోరా వ్యక్తిగత జీవితానికి వస్తే. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

అర్బాజ్ ఖాన్‌తో ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా రిలేషన్‌షిప్‌లో ఉంది. తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు. గతంలో కలిసి కనిపించిన ఈ జంట , ఇప్పుడు విడిపోయి, వేర్వేరుగా దర్శనం ఇస్తున్నారు. అర్జున్ కపూర్‌తో విడిపోయిన్ తర్వాత మలైక మరో అబ్బాయిన్ సెట్ చేసుకుందనే ప్రచారం జరుగుతుంది. మలైక అరోరా ఇటీవల ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు ఓ వ్యక్తి కూడా దర్శనం ఇచ్చాడు.
హర్ష్ మెహతా అనే యువకుడితో ఓ ఈవెంట్‌లో క్లోజ్‌గా కనిపించింది మలైక. హర్ష్ మెహతాకు బెల్జియంలో డైమండ్ కంపెనీ ఉందని తెలుస్తోంది. అతను ఇప్పటికే వ్యాపారవేత్తగా ప్రూవ్ చేసుకున్నాడు.మలైక అతనితో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించడంతో .. ఆమె డేటింగ్‌లో ఉందని అంతా నిర్ధారించుకుంటున్నారు. వీరి బంధంపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. ప్రేమకు వయస్సుతో హద్దులు లేవని మరోసారి నిరూపించబడిందని కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఈ వయస్సులో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications