నన్ను తిట్టిన తిట్లన్నీ మీ అమ్మను అన్నట్టేరా..!

టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం మచ్చ ఏసుకునే పుట్టిందని చెప్పాలి. ఆ హీరోయిన్ మరెవరో కాదు..శివానీ నాగారం. తొలుత యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించకుంది శివానీ నాగారం.

ఆ తర్వాత వెండితెర నుంచి అవకాశాలు దక్కాయి. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. హీరోయిన్‌గా నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖతాలో వేసుకుంది ఈ బ్యూటీ. సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయన్ని నమోదు చేసింది. తాజాగా 'లిటిల్ హార్ట్స్' అంటూ వచ్చిన చిన్న సినిమాతో మరో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Heroine Shivani Nagaram s Strong Reply to Troll Goes Viral

ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. రెండు వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న శివానీ.. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. దీనికి కారణం కూడా ఆమెకావడం విశేషం. రెండు సినిమాలు హిట్ కాగానే అందాలు ఆరబోస్తోందని శివానీ నాగారం ఫొటోలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.ముఖ్యంగా బ్లాక్ సారీలో తన నడుము, ఎద‌ అందాలు కనిపించేలా మెరిసింది శివానీ. దీంతో ఆమెపై దారుణంగా తిట్ల దండకం మొదలుపెట్టారు.

రెండు సినిమాలు హిట్ కాగానే మొత్తం చూపిస్తారంటూ ఓ నెటజన్ కామెంట్ పెట్టాడు. అయితే ఆ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు తనదైనశైలిలో సమాధానం చెప్పింది శివానీ. నన్ను ఏమైతే తిట్టావో అవన్నీ కూడా మీ అమ్మను అన్నట్టే అంటూ ఆ నెటిజన్‌కు అదిరిపోయే కౌంటరిచ్చింది. శివానీ దెబ్బకు వణికిపోయిన నెటిజన్, తాను పెట్టిన కామెంట్‌ను డిలీట్ చేశాడు. అయితే దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్‌గా అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+