శృంగారంలో మగాళ్లు భయపడేది అందుకే: తమన్నా
తమన్నా పేరు చెప్పగానే కుర్రకారుకు మైకం కమ్ముతుంది. చిన్న గెస్ట్ రోల్ చేసిన సినిమా విడుదలైనా సరే తమన్నా ఉందంటే కుర్రకారు మాత్రం ఆ సినిమాకు పరిగెత్తుతారు. అంతలా తన గ్లామర్ తో యువతను కట్టిపడేస్తోంది. కెరీర్ ప్రారంభంలో తమన్నా గ్లామర్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. వెండి తెరపై అందంగా కనిపించడంలో తమన్నాకి ఎలాంటి హద్దులు లేవు. నేను ఇలాగే కనపడతాను.. ఇలాంటి సన్నివేశాల్లోనే నటిస్తాను అనే షరతులు ఆమె దగ్గర ఉండవు. అందుకే దర్శకులు మొదటి ఛాయిస్ గా తమన్నానే ఎంచుకుంటారు.
ఘాటుగా శృంగారం
అయితే తమన్నా ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్లలో నటించకూడదని నిబంధన పెట్టుకుంది. కానీ ఆ నిబంధనను తానే బ్రేక్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కార్ద అనే వెబ్ సిరీస్ లలో తమన్నా బోల్డ్ గా ఎలా నటించిందో దేశం మొత్తం చూసింది. సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఘాటుగా శృంగార సన్నివేశాల్లో నటించడంతో తమన్నాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.

నా నిబంధనను నేనే బ్రేక్ చేశా
నటిగా ఎప్పుడూ ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకూడదని, అన్నిరకాల పాత్రలు చేయాలనేది తమన్నా లక్ష్యం. తనను తాను ప్రశ్నించుకొనే నిబంధనను ఉల్లంఘించినట్లు గతంలోనే చెప్పింది. తను చివరగా బాక్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవలేదు. తమన్నా, రాశిఖన్నా కలిసి ఈ సినిమాలో అందాల విందు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా బోల్డ్ కామెంట్స్ చేసింది.
మగావారు టెన్షన్ పడతారు
శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్లలో నటించేటప్పుడు హీరోయిన్లు ఇబ్బంది పడుతుంటారు అని అందరూ అనుకుంటారని, కానీ అది వాస్తవం కాదన్నారు. అటువంటి సన్నివేశాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువ ఇబ్బంది, టెన్షన్ ఫీల్ అయ్యేది హీరోలేనని చెప్పింది. తనతోపాటు నటిస్తున్న నటి ఇబ్బంది పడకూడదనేది హీరోల భావన అని, జాగ్రత్తగా ఉండాలని భావిస్తారని, ఎదుటివారు ఏమనుకుంటారో అని టెన్షన్ పడుతుంటారని తమన్నా వెల్లడించింది. ఇలాంటి భావనతో ఉండే సన్నివేశం సరిగా రాదని, హీరో, హీరోయిన్లు ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తో నటించాలని, అప్పుడే సన్నివేశం బాగా వస్తుందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications