ప్రెగ్నెన్సీపై కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..హీరోయిన్ కరీనా కపూర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కరీనా కపూర్ ..ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్, షారుక్ వంటి స్టార్ హీరోలతో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.ఇక ఎఫైర్ల విషయంలో కూడా కరీనా కపూర్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. పలువురు హీరోలతో సాగించిన ఎఫైర్స్ కూడా ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కరీనా కపూర్ ప్రేమయాణం సాగించింది. వీరిద్దరు కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు.పెళ్లి చేసుకుంటానుకున్న వీరిద్దరు అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడిపోయారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే పెళ్లై తన వయస్సు కూతురున్న వ్యక్తిని కరీనా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేయడంలో కరీనా కపూర్ తర్వాతే ఎవరైనా.

ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ భామ. కరీనా కపూర్ తాజాగా చేసిన ఓ పని వివాదంగా మారింది. కరీనా కపూర్ ఇటీవలే ఓ బుక్ రాసింది. అయితే ఆ బుక్‌కు ''కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అని నామకారణం చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆమె రాసిన పుస్తకంపై 'బైబిల్' అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతికేరిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ అంథోనీ కోర్టును ఆశ్రయించాడు. క్రైస్తవులు పవిత్ర గ్రంథంగా బైబిల్‌ను భావిస్తారు. అలాంటిది కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం తప్పని చెప్పుకొచ్చాడు. దీంతో నటి కరీనాకు హైకోర్టు నోటీసు జారీ చేయబడింది. ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఆమెకు నోటీసు జారీ చేసింది.నోటీసులపై కరీనా కపూర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications