సెంట్రల్ జైల్లో హీరోకు రాచమర్యాదలు?, మర్యాదరామన్న ఎవరో తెలుసా, ఫ్యామిలీ ప్యాక్

బెంగళూరులో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య కేసులో హీరో దర్శన్, అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. జైల్లో ఉన్న దర్శన్ చూసేందుకు ఎవరో ఒకరు రోజూ సెంట్రల్ జైలుకు వెలుతున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు దర్శన్‌ను చూసేందుకు ఆయన తల్లి మీనా, తమ్ముడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ వెళ్లారు.

అయితే వీళ్లు జైలులో ఉన్న వారిని సందర్శించాలనుకుంటే, వీరు ప్రవేశించడానికి చట్టపరమైన అనుమతి పొందాలి. అయితే నటుడు దర్శన్ కుటుంబానికి ఓ చట్టం, సామాన్యులకు చట్టం అన్నట్లుగా పరప్ప అగ్రహార జైలు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నటుడు దర్శన్ కుటుంబాన్ని ప్రైవేట్ వాహనంలో జైలు లోపలికి తీసుకెళ్లి దర్శన్‌ను కలిసేందుకు అనుమతించారని ఆరోపణలు వచ్చాయి.

His family members met Kannada hero Darshan in Bengaluru Central Jail

జైళ్ల శాఖలోని చట్టాలను తుంగలో తొక్కుతున్న జైలు అధికారులు దర్శన్ హీరో అనే కారణంతో ఆయనకు రాచమర్యాదలు చేస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.సాధారణ ప్రజలు జైలులో ప్రవేశించాలంటే డజన్ల కొద్దీ చట్టాలను పాటించాలి. అయితే హీరో దర్శన్ కుటుంబం మాత్రం ఎలాంటి నిబంధనలు పాటించకుండా జైలులోకి ఎంట్రీ ఇస్తోంది. దీనికి పోలీసులు, జైలు సిబ్బంది మద్దతు ఇస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు దర్శన్‌ను కుటుంబసభ్యులు మీడియాకు కనపడకుండా కలిశారు. పది గంటల ప్రాంతంలో దర్శన్ తల్లి మీనా, తమ్ముడు దినకర్, భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ పరప్ప అగ్రహార జైలులోకి ప్రవేశించారు. ఈ సమయంలో, పోలీసు సిబ్బంది వ్యక్తిగతంగా అతనిని తమ ప్రైవేట్ కారులో జైలు లోపలికి వీళ్లను తీసుకెళ్లారు.

పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ నటుడు దర్శన్‌ని కలిసేందుకు ప్రైవేట్ వాహనంలో అతని కుటుంబ సభ్యులను జైలు లోపలికి తీసుకెళ్లాడు.

ఇప్పుడు ఇదే ఉదయ్ గత సోమవారం కూడా దర్శన్ భార్యను, కొడుకును మీడియా కంట కనపడకుండా జైలులోకి ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లాడని, ఇప్పుడు కూడా అదే హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ ప్రైవేట్ కారులో దర్శన్ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంతో ఇప్పుడు జైలులో వివాదానికి కారణం అయ్యింది. ఈ విషయాలు గమనిస్తే బెంగళూరు సెంట్రల్ జైలులో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం అవుతోందని, సామాన్యులకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+