రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం; ఉబ్బి తబ్బిబ్బైన పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే!!
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా ఆయన స్టార్ మారిపోయింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావటంతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కు తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది.
రామ్ చరణ్ కు అరుదైన గౌరవం
రామ్ చరణ్ కు ఓ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించినట్టు వెల్లడించింది. ఏప్రిల్ 13వ తేదీన ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయబోతున్నారు. వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతున్న ఆయన అక్కడ గౌరవ డాక్టరేట్ ను అందుకోబోతున్నారు.

రామ్ చరణ్ కు అభినందనలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రకటన
రామ్ చరణ్ తెలుగు సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ను వేల్స్ యూనివర్సిటీ అందించబోతుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అన్న కొడుకు మెగా పవర్ స్టార్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించటంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్
చలనచిత్ర రంగంలో తనదైన పంధాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ఇవ్వటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రామ్ చరణ్ కు దక్కిన గౌరవం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రామ్ చరణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆకాంక్ష ఇదే
తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం వారు రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు రామ్ చరణ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రాంచరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
-
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications