ఐశ్వర్యరాయ్ బాడీగార్డు జీతం ఎంతో తెలుసా..? సీఈఓలు కూడా ఇంత సంపాదించరు భయ్యా..!
ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళలో ఇరువర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారామె.
ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొన్నాళ్లకు అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. అయితే పెళ్లికి ముందు ఐశ్వర్య రాయ్ పలువురి హీరోయిన్లతో ఎఫైర్ సాగించిందనే విషయం తెలిసిందే. వివేక్ ఒబెరాయ్‌తో పాటు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్య రాయ్ ప్రేమాయణం సాగించింది. ఐశ్వర్య రాయ్ తన ఎఫైర్లను ఎప్పుడూ దాచి పెట్టాలని ప్రయత్నించలేదు.

బచ్చన్ ఫ్యామిలీ ఇంటి కోడలు అయిన తర్వాత ఐశ్వర్య రాయ్ పాపులారిటీ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ జీతం గురించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఐశ్వర్యరాయ్ వ్యక్తిత బాడీగార్డ్‌గా శివరాజ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు.ఇప్పుడు అతను తీసుకునే జీతం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.బాడీగార్డ్‌గా శివరాజ్ నెల జీతం దాదాపు రూ. 7 లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది.
అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. ఐశ్వర్యరాయ్ బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, వారిని రక్షించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు, బాధ్యతల నేపథ్యంలోనే సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభిస్తున్నాయి.












Click it and Unblock the Notifications